కేంద్రం ఓవర్ చేస్తోందా ?

First Published Dec 30, 2016, 5:42 AM IST
Highlights

నల్లధనం వెలికితీయటంలో శృతిమించిన దండన మంచిది కాదని ఉర్జిత్ పేర్కొనటం గమనార్హం.

నల్లధనాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తప్పదని ప్రధానమంత్రి నరేంద్రమోడి చెబుతున్న మాటలతో ఆర్బిఐ విభేదిస్తోందా. ఆర్బిఐ విడుదల చేసిన ఓ నివేదిక అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఎందుకంటే, నల్లధనం పేరు చెప్పి కేంద్ర ప్రభుత్వం ఓవర్ యాక్షన్ చేస్తోందని ఆర్బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అభిప్రాయపడుతున్నట్లు అనిపిస్తుంది.

 

నల్లధనం విషయంలో గురువారం ఆర్బిఐ విడుదల చేసిన ‘ఫైనాన్సియల్ స్టెబిలిటీ’ నివేదికలో ఉర్జిత్ వెల్లడించిన అభిప్రాయాలు అలానే ఉన్నాయి మరి. నల్లధనం వెలికితీయటంలో శృతిమించిన దండన మంచిది కాదని ఉర్జిత్ పేర్కొనటం గమనార్హం.

 

నల్లధనాన్నిఅరికట్టేందుకు పాలనా పరమైన విధానాలను మెరుగుపరచాలన్నారు. సర్వీసుల నాణ్యత పెంచటంతో పాటు అతి నియంత్రణలకు స్వస్తి పలకాలని చెప్పారు. పన్నులను సరళతరం చేస్తూనే జరిమానాలు భారీగా వడ్డించాలని సూచించారు. పన్ను రేటు ఒక్కశాతం పెరిగితే నల్లధనం 14 శాతం పెరుగుతుందని అమెరికాలో వెల్లడైందన్నారు.

 

పెద్ద నోట్ల రద్దు తర్వాత మోడి కానీ జైట్లీ కానీ ఇంత వరకూ బ్యాంకుల వద్ద పేరుకుపోతున్న బకాయిల గురించి మాట్లాడలేదు. అయితే, ఉర్జిత్ మాట్లాడతూ, పేరుకుపోయిన ఎన్పిఏలు ఆర్ధికరంగానికి పెను సవాలుగా మారినట్లు ఆందోళన వ్యక్తం చేసారు.

 

అలాగే పెద్ద నోట్ల రద్దు దీర్ఘకాలంలో పెనుమార్పలకు దోహం చేస్తుందని అభిప్రాయపడ్డారు. డిజిటల్ పేమెంట్స్ పెరగటం మంచి పరిణామంగా పేర్కొన్నారు. ప్రైవేటు బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల వృద్ధి రేటు మందకొడిగా ఉందని ఉర్జిత్ అంగీకరించారు.

click me!