తాజ్ మహల్ గురించి చాలా మందికి తెలియని 11 రహస్యాలు

First Published Oct 17, 2017, 4:26 PM IST
Highlights
  • తాజ్ మహల్ రోజులో ఎన్ని సార్లు రంగులు మారుతుంది?
  • తాజ్ మహల్ నిర్మించడానికి ఎంత ఖర్చు అయ్యింది?
  • గంగానది తీరాన తాజ్ మహల్ కట్టకపోతే ఏమయ్యేది?

గత కొంతకాలంగా తాజ్ మహల్ పై వివాదం నడుస్తోంది.  యూపీ బిజెపి ప్రభుత్వ పర్యాటక శాఖ  ఓ బుక్ లెట్ ని విడుదల చేసింది. అందులో తాజ్ మహల్ ప్రస్తావన తీసుకురాలేదు. దీంతో వివాదం రాజుకుంది. ఈ వివాదం చల్లారే లోపు  అసలు తాజ్ మహల్ ది చరిత్రే కాదు.. మన భారత సంస్కృతికి మాయని మచ్చ అంటూ ఓ బీజేపీ ఎమ్మెల్యే 'సంగీత్ సోం  మరొక వివాదం సృష్టించాడు.  తాజాగా.. ఈ విషయంపై  ప్రధాని మోదీ కూడా  స్పందించారు.  తాజ్ మహల్ మన దేశ వారసత్వం అంటూ చెప్పుకొచ్చారు, వారసత్వ సంపదను మర్చిపోతే,  ఉనికి  పోతుందన్నారు. ఇంతకీ ఈ తాజ్ మహల్ గొప్పదనం ఏమిటి?

తాజ్ మహల్ గురించి మీకు ఎంత వరకు తెలుసు? తాజ్ మహల్ ని ఎవరు కట్టించారో తెలుసు.. ఎందుకు కట్టించారో తెలుసు.. అంతేనా? ఇవే కాదండి  తాజ్ మహల్ గురించి మీకు తెలియని చాలా అంశాలు ఉన్నాయి.. అవేంటో ఒకసారి చూద్దామా..

1. తాజ్ మహల్ మొయిన్ హాల్ లోని సీలింగ్ వద్ద చిన్న రంధ్రం ఉంటుంది. అది ముంతాజ్ సమాధికి లంబంగా ఈ రంధ్రం ఉంటుంది. చరిత్ర ప్రకారం తాజ్ మహల్ లాంటి అందమైన కట్టడమ మరొకటి ఉండకూడదనే భావనతో.. దానిని కట్టిన కళాకారుల చేతులను షాజహాన్ నరికివేశాడు అనే నానుడి ఉంది. అది తెలిసిన ఓ కళాకారుడు.. తాజ్ మహల్ కి ఒక మచ్చ ఉండాలని.. సీలింగ్ వద్ద చిన్న రంథ్రం పెట్టాడు అని అందరూ చెప్పుకుంటుంటారు.

2.తాజ్ మహల్ మరో గొప్పతనం ఏమిటంటే.. అది రంగులు మారుతూ ఉంటుంది. సూర్యోదయం సమయంలో ముత్యాల  బూడిద రంగు,  సాయంకాలం గులాబి రంగులో, మధ్యాహ్నం సమయంలో మిళ మిళ లాడే తెలుపు రంగులో సూర్యాస్తమయంలో నారింజ-బంగారు రంగులో, సాయంత్రం వేళలో నీలిరంగులోనూ దర్శనమిస్తుంది.

3.తాజ్ మహల్ ని నిర్మించిన ఆరిస్టుల చేతులను షాజహాన్ నరికివేశాడనడంలో వాస్తవం లేదు. ఎందుకంటే.. తాజ్ మహల్ నిర్మించిన వారే ఎర్రకోటని కూడా నిర్మించారట. ఉస్తాద్ అహ్మద్ లహౌరి అనే వ్యక్తి ఆ ఆర్కిటెక్ట్ లందరికీ లీడర్. తాజ్ మహల్ నిర్మాణం తర్వాత అతను చాలా కట్టడాలను నిర్మించాడని సమాచారం.

4. భూకంపాలు వంటివి వచ్చినా కూడా తాజ్ మహల్ కి ఏమీ కాకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. తాజ్ మహల్ ని ఒకసారి పరిశీలిస్తే.. నాలుగువైపులా స్థంబాలు ఉంటాయి. అవి భూకంపం లాంటి ప్రమాదాల నుంచి తాజ్ ని కాపాడటానికి ఉపయోగపడతాయి.

5. తాజ్ మహల్ ని పలుమార్లు అమ్మిన నట్వర్ లాల్ అనే వ్యక్తి పేరు మీద గుడి కూడా కట్టారు. బిహార్ లోని బంగారా గ్రామంలో నట్వర్ లాల్  నివసించేవాడు. అందుకే ఆ గ్రామంలోనే అతని విగ్రహం ఏర్పాటు చేశారు.

6.యమునా నది పక్కన నిర్మించారు కాబట్టే తాజ్ మహల్ ఇప్పటికే చెక్కు చెదరకుండా ఉంది. ఎందుకంటే తాజ్ మహల్ పునాదిని కలపతో వేశారట. అది ఎక్కువకాలం నిల్వ ఉండదు. అయితే, యమునా నది దగ్గర్లో ఉండటం వల్ల ఆ  నీటి చెమ్మ  తగిలి కలప గట్టిపడి పునాది పటిష్టపడిందట.

7.తాజ్ మహల్ కు అత్యంత ఆకర్షణీయమయిన  ఇంటీరియర్ డిజైన్ ఉంటుంది. దానిని విలువయిన రాళ్లతో తయారు చేశారట. ఇంటీరియర్ డిజైన్ లో 28రకాల అరుదైన, విలువైన రాళ్లను ఉపయోగించారు. వాటిని భారత్ లోని పలు ప్రాంతాలతోపాటు శ్రీలంక, టిబెట్, చైనా వంటి దేశాల నుంచి తెప్పించి నిర్మించారు.

8. తాజ్ మహల్ కుతుబ్ మినార్ కంటే 5 అడుగులు పొడవైనది. ప్రపంచంలోని అన్ని స్మారక కట్టడాలను పోల్చి చూసినప్పుడు ఈ విషయం బయటపడింది.

9. తాజ్ మహల్ నిర్మాణానికి ఎంత ఖర్చు అయ్యిందో తెలుసా?  షాజహాన్.. తాజ్ మహల్ నిర్మాణానికి  1632-1653 సంవత్సర కాలంలో 32మిలియన్ రూపాయిలను ఖర్చు చేశారు.ఇప్పుడు దాని విలువ 100కోట్ల డాలర్లు.

10.తాజ్ మహల్ ని ప్రతి రోజు కనీసం 12వేల మంది సందర్శిస్తారు. ప్రపంచ వింతల్లో ఎక్కువగా ప్రజలు సందర్శించేది తాజ్ మహల్ నే.

11. షాజహాన్.. తన భార్య ముంతాజ్ మీద ఉన్న ప్రేమకు గుర్తుగా తాజ్ మహల్ ని నిర్మించాడు. అదేవిధంగా తన సమాధిని కూడా నిర్మించాలనుకున్నాడట. తాజ్ మహల్ తెల్లగా ఉంటే.. దాని ఎదురుగా అలాంటిదే నలుపు రంగులో నిర్మిచానుకున్నాడు. కానీ.. అతని కుమారుడు ఔరంగజేబు కారణంగా అది సాధ్యం కాలేదు.

click me!