తాజ్ మహల్ వివాదంపై స్పందించిన మోదీ

First Published Oct 17, 2017, 2:46 PM IST
Highlights
  • తాజ్ మహల్ పై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
  • విషయంపై  స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ

ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్ పై నడుస్తున్న వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ  స్పందించారు. దేశ సంస్కృతిని, వారసత్వం  గర్వింగా చెప్పుకోలేని ఏ దేశం అభివృద్ధి సాధించలేదని మోదీ అన్నారు.

ఇటీవల యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్.. తాజ్ మహల్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజ్ మహల్.. భారత సంస్కృతికి మాయని మచ్చ అని,  అక్బర్, బాబర్ లను దేశద్రోహులని పేర్కొన్నాడు. దీంతో ఈ విషయం తీవ్ర వివాదాస్పదమైంది.

అయితే.. మంగళవారం ఈ విషయంపై ప్రధాని మోదీ మాట్లాడారు.  తమ దేశ సంస్కృతి, చరిత్రలను గౌరవిస్తేనే ఆ దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. అలా చేయనప్పుడు కొంత కాలం తర్వాత సొంత ఐడెంటిటీని కూడా పోగొట్టుకుంటారని మోదీ పేర్కొన్నారు.

ఇదే విషయంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా స్పదించారు. తాజ్ మహల్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను ఎమ్మెల్యే సంగీత్ సోమ్ పై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే సోమ్.. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సూచించిట్లు పలువురు బీజేపీ నేతలు చెబుతున్నారు.

click me!