భార‌తీయులు అస్స‌లు ముద్దులు పెట్టుకోరు, చాలా సంస్కార‌వంతులు

Published : Aug 03, 2017, 12:23 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
భార‌తీయులు అస్స‌లు ముద్దులు పెట్టుకోరు, చాలా సంస్కార‌వంతులు

సారాంశం

బాబూమోషై బందూక్‌బాజ్ సినిమా వివాదం. బాబూమోషై బందూక్‌బాజ్ సినిమా కట్స్ పై ఫైర్ అయిన బిదితా అస్సలు ఇండియన్లు ముద్దులు పెట్టుకొరని వ్యంగాస్త్రాలు.  

ఈ మాట అన్న‌ది బాలీవుడ్ హీరోయిన్‌ బిదితా. త‌ను న‌టించిన బాబూమోషై బందూక్‌బాజ్ సినిమాకు సెన్సార్ బోర్డు అత్య‌ధిక‌ క‌ట్స్ చెప్ప‌డ‌మే కార‌ణం. "బాబూమోషై బందూక్‌బాజ్" సినిమాలో న‌వాజుద్దీన్ సిద్దిఖీ క‌థానాయ‌కుడిగా న‌టించించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఎకంగా 48 క‌ట్స్ చెప్పింది. దీని పై సెన్సార్ బోర్డ్ ఛైర్మ‌న్ ప‌హ్లాజ్ కూడా వివరణ ఇచ్చారు.. మాకు ఆ సినిమా పై ప్ర‌త్యేక‌మైన‌ క‌క్ష్య లేద‌ని, ఉన్న నిబంధ‌న‌ల ప్ర‌కారం మేము ఆ స‌న్నివేశాల్ని తొల‌గించాల్సిందిగా తెలిపారు.

ఇప్పుడు ఈ సినిమాకు చెప్పిన క‌ట్స్ విష‌యం చ‌ర్చ‌నీయాంశం అయింది. ఈ సినిమా లో సిద్దీఖీ, బిదితా మ‌ధ్య చుంభ‌న స‌న్నివేశాల‌ను కూడా తొలగించాల్సిందిగా కొరారు. అందుకు బాలీవుడ్ పెద్ద‌లు నుండి కూడా అభ్యంత‌రం వ్య‌క్తం అయింది. 

 

సాధార‌ణంగా సెన్సార్ బోర్డుకు వ్య‌తిరేకంగా తారాలు నేరుగా మాట్లాడం జ‌ర‌గ‌దు. కానీ ఈ విష‌యంపై బోర్డ్‌ తీరు పై బిదితా ఆగ్ర‌హాం వ్య‌క్తం చేసింది ‘‘భారతీయులు ముద్దులు పెట్టుకోరు, భారతీయులు బూతులు మాట్లాడరు’’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో వ్యంగ్యస్త్రాలు సంధించింది. అంతేకాదు ఆ ఫోటోకు ‘సంస్కారి’, ‘సీబీఎఫీసీ’ అనే ట్యాగ్స్ కూడా జోడించింది. 
 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !