
‘ఒక్క నీటి ప్రాజెక్ట్ ల పైన 164 కేస్ లు వేస్తారా ఏ రాష్ట్రంలో నైన ఇలా వేస్తారా... ఇప్పటి వరకు 196 కేస్ లు వేశారు. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న రో దీన్ని బట్టి అర్ధం అవుతుంది,’ అని కెసిఆర్ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోశారు.
కాంగ్రస్ పార్టీని ఏకిపారేసుందుకు ఆయన గతంలో ఎపుడూ ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయలేదు.
ఈ మధ్య కాంగ్రెస్ కార్యకలాపాలు ముమ్మరం కావడం, ఆ పార్టీ కెసిఆర్ కుమారుడు ఐటి మంత్రి కెటిఆర్ మీద దాడి చేస్తూ ఉండటం, తెలంగాణా ప్రభుత్వానికి కోర్టు షాక్ అంటూ రోజు పత్రికల్లో వార్తలొస్తుండటంతో కెసిఆర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని తిట్టిన తిట్టు మళ్లీ తిట్టకుండా తిట్టారు.కాంగ్రెస్ పార్టీ పిశాచి అన్నారు. కాంగ్రెసోళ్లది నాలుక కాదు, తాటాకు మట్ట అన్నారు. దిగ్విజయ్ ను, మీరాకుమార్ ను, జయరామ్ రమేశ్ ను వదల్లేదు. అయితే, ఆయన ఉద్యమాలను ఉధృతం చేస్తున్న ప్రొఫెసర్ కోదండరాం జోలికి ఈ సారి వెళ్ల లేదు.
ముఖ్యమంత్రి లేవ దీసిని అంశాలివి:
*పనికి మాలిన రాజకీయ లబ్ది కోసం కేస్ లు వేస్తున్నారు. ప్రతి పనికి అడ్డుకోవడం కోసం కేస్ వేస్తున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్లే. ఒక్కటే కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఒక్కరోజే 6 కేస్ లు వేశారు. అన్నింటివని కొట్టివేశారు. కొన్ని సందర్భలలో వాళ్ళను న్యాయమూర్తులు మొట్టి కాయలు వేశారు. నీచాతి నీచమైన రాజకీయాలకు దిగుతున్నారు కాంగ్రెస్ వాళ్లు.
*కాంటాక్ట్ వ్యవస్థను పుణ్యాత్ముడు చంద్రబాబు ప్రవేశ పెట్టిండు. దాన్ని రాజశేఖర్ రెడ్డి కొనసాగించాడు.గతంలో నేను ఉద్యమ సమయంలో వాళ్లకు మద్దతు గా నేను పోరాడను. ఆ టైం లో 3 వేలు పెంచారు.తర్వాత కొంత కిరణ్ కుమార్ రెడ్డి పెంచాడు.
విద్యుత్ ఉద్యోగుల విషయం లో కూడా వాళ్ళను అబ్జార్ప్ చేశాం కానీ వాళ్ళను రెగులర్ చెయ్యలేదు. దీన్ని ఎదో అర్ధం చేసుకొని కోర్ట్ ల చుట్టూ తిరుగుతున్నారు. దయచేసి కోర్ట్ వాళ్ళు అర్ధం చేసుకోవాలి. కోర్ట్ వాళ్ళు అవలంభించిన తీరు అభినందనీయం. కోర్ట్ వాళ్లు నిర్ణయించిన దానికంటే ఒక్క వెయ్యి అదనంగా ఇస్తున్నాం.
*గతంలో గాంధీ భవన్ ను కాంటాక్ట్ లెక్చరర్ లు ముట్టడి చేశారు. త్వరలో హోమ్ గర్డ్స్ ను పిలుచుకుని వాళ్లకు కూడా న్యాయం చేస్తాం.
*కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు ను ప్రజలు కూడా గమనించాలి. వాళ్ళ దుర్మార్గం తీరును అందరు గమనించాలి.
*కాళేశ్వరం ప్రాజెక్ట్స్ విషయం లో కాళేశ్వరం కి నీళ్లు వస్తున్నాయి అంటే కాంగ్రేస్ వాళ్ల గుండెలు అవిశి పోతున్నాయి. 4400 ఎకరాలు కావాలి కొండపోచమ్మ ప్రాజెక్ట్స్ కి ఇప్పటికే 4200 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ అయింది . ఆ 200 ఎకరాలు ఎవ్వరి అంటే కాంగ్రెస్ వాళ్ల వే. 200 ఎకరాల భూమికి ప్రాజెక్ట్స్ అపుతారా...ఇదేనా మీ నీచ రాజకీయం .. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారు.
*చీకట్లో ఉన్న తెలంగాణ ను వెలుగులు నింపుదాం అని యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్స్ నిర్మిస్తే కూడా కేస్ లు వేసి ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దుర్మార్గంగా నేషనల్ పార్టీ వ్యవహరిస్తదా..... ఇదేనా మీ పార్టీ ...
*తెలంగాణ కు ముల్కి రూల్స్ ఉండాలి అని కోర్ట్ సూచిస్తే ఆ రూల్స్ రద్దు చేసి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టిన పార్టీ కాంగ్రేస్ పార్టీ. 2004 లో తెలంగాణ లో మా పార్టీ తో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చినా తెలంగాణ ఇవ్వలేదు. సచ్చే ముందే సావు తప్పదు అని 2014లో తెలంగాణ ను ఇచ్చింది. అందుకే తెలంగాణ ప్రజలు వాళ్ళను తిరస్కరించారు.వాళ్లకు సిద్ధాంతాలు సిగ్గులు లేవు ... మాట్లాడనికి కొంచం సిగ్గు ఉండాలి. అచ్ఛంపేటలో అల్ పార్టీ అని ఎన్నికలకు పోతే ఒక్క కౌన్సిలర్ కూడా రాలేదు. లాస్ట్ కు పాలేరు లో కూడా అన్ని పక్షాలు ఒక్కటైన మా అభ్యర్థి తుమ్మల గెలిచాడు..
*చివరికి అమరవీరుల స్థూపం మీద కూడా కేస్ వేశారు.అన్నింటి లో పిల్ లు వేస్తూ పిల్ కాంగ్రెస్ గా వ్యవహరిస్తోంది. ఇంత దుర్మార్గంగా దేశంలో ఎక్కడ లేదు.
*24 గంటల కరెంట్ వద్దు అని అంటున్నారు రైతులు .గతంలో కరెంట్ కావాలి అని ధర్నాలు చేశారు.
ఈరోజు విద్యుత్ వినియోగం 9326 మెగా వాట్స్ .. ఎంత డిమాండ్ పెరిగిన ఎక్కడ కూడా అంతరాయం లేకుండా ఇస్తున్నారు. గిట్ల చేస్తే గెలువరు ఇటువంటి పద్దతి మంచిది కాదు మీరు ఎం చేసిన ...మేము చేస్తున్న మంచి పనులు, ప్రగతి ని ,ప్రాజెక్ట్స్ ను మీరు ఆపలేరు.
సభ(అసెంబ్లీ)ని కూడా నడపడనికి మేము రెడీ గా ఉంటే మీరు సహకరించరు...శాసనసభ నిబంధనలకు అనుగుణంగా నడిపిస్తాం ఎవరైనా అరిస్తే మెడలు పట్టి బయటకు పంపుతాం...
*డ్రగ్స్ సంబంధించిన విషయం ను మొగ్గ దశలో తెంచాలి. అని కాబినెట్ మంత్రి ఉన్న వదలవద్దు స్వయంగా చెప్పాను. ఈ గబ్బును తెచ్చింది ఎవరండి, ఈ కాంగ్రెస్ వాళ్లు కాదా...