ఎన్ ఆర్ఐలు ఓటు వేయాలంటే..ఈ విధానం పాటించాలి

Published : Aug 03, 2017, 12:16 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
ఎన్ ఆర్ఐలు ఓటు వేయాలంటే..ఈ విధానం పాటించాలి

సారాంశం

ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఓటు హక్కును వినియోగించుకుంటారు తమ తరపున ఎవరో  ఒకరిని నామినేట్ చేసుకుంటారు

 

ప్రవాస భారతీయులు కూడా ఇప్పడు ఎన్నికల్లో పాల్గొనవచ్చు. మన దేశంలో జరిగే లోక్ సభ, అసంబ్లీ ఎన్నికల్లో ఎన్ ఆర్ఐలు  తమకు నచ్చిన నాయకుడికి ఓటు వేసి వారిని గెలిపించవచ్చు.  అది కూడా ప్రాక్సీ విధానంలో. అనగా..ఎన్ ఆర్ఐ లు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుాండా దీని కోసం ప్రభుత్వం ప్రజాప్రాతినిధ్య చట్టంలో సవరణ కూడా చేయనుంది.

 భారత్ లో జరిగే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో.. ఎన్ ఆర్ఐ లు తమ తరపున ఎవరో  ఒకరిని నామినేట్ చేసుకుంటారు. వారి ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ప్రతి ఎన్నికలకు ఒకరే నామినేట్ చేసుకునే అవకాశం లేదు. ఈ ఎన్నికల్లో ఒకరిని నామినేట్ చేసుకుంటే.. తరువాతి ఎన్నికల్లో మరోకరిని నామినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 

 భద్రతా దళాలు ఏవిధంగా అయితే పోస్టు ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారో.. అదేవిధంగా ప్రవా స భారతీయులు కూడా వినియోగించుకునేలా సదుపాయం కల్పిద్దామని మొదట ప్రభుత్వం యోచించింది. కానీ తర్వాత ఈ ప్రాక్సీ విధానాన్ని ప్రవేశపెట్టింది. దాదాపు ఒక కోటి మంది భారతీయులు విదేశాలలో స్థిరపడ్డారు. వీరిలో 60లక్షల మందికి ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఈ విధానం  ద్వారా ఇప్పుడు వీరంతా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా కేరళ, పంజాబ్‌, గుజరాత్,  తెలంగాణ రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లిన వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !