ఆస్ట్రేలియాలో భారత సంతతి మహిళకు జైలు శిక్ష..

Published : Sep 06, 2017, 03:54 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
ఆస్ట్రేలియాలో భారత సంతతి మహిళకు జైలు శిక్ష..

సారాంశం

భారత సంతతి మహిళకు జైలు శిక్ష విధించిన ఆస్ట్రేలియా కోర్టు బాధ్యతా రాహిత్యంగా కారు నడిపి.. ఒకరి మృతికి కారణమైన మహిళ

భారత సంతతికి చెందిన ఓ మహిళ(32) ఆస్ట్రేలియాలో జైలు పాలయ్యారు. ఆమెకు అక్కడి న్యాయస్థానం రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది. ఓ పసిబిడ్డ ప్రాణం పోవడానికి కారణమైనందుకు ఆమెకు ఈ శిక్ష విధించారు.

వివరాల్లోకి వెళితే.. డింపుల్ థామస్ గ్రేస్ అనే భారత సంతతి మహిళ అక్కడ నర్సుగా పనిచేస్తోంది. గత నెల ఆగస్టులో ఆమె  జిమ్ కి వెళ్లి తిరిగి కారులో తిరిగి వస్తుండగా.. ఓ మహిళ ఢీకొట్టింది. ప్రమాదానికి గురైన సమయంలో బాధితురాలు.. 28 వారాల గర్భవతి. కారు ఢీకొనడంతో  ఆమె తీవ్రగాయాలపాలైంది. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ఆమె కడుపులోని బిడ్డ మృతిచెందింది.  దీంతో బాధితురాలు తనకు న్యాయం కావాలంటూ కోర్టును ఆశ్రయించింది.

థామస్.. బాధ్యతారహితంగా డ్రైవింగ్ చేసి.. ఓ పసిబిడ్డ చావుకు కారణమైనట్లు భావించిన న్యాయస్థానం ఆమెకు జైలు శిక్ష  విధించింది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !