భారతీయ ‘గూఢచారి’కి పాకిస్తాన్ లో మరణ శిక్ష

Published : Apr 10, 2017, 09:51 AM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
భారతీయ ‘గూఢచారి’కి పాకిస్తాన్ లో  మరణ శిక్ష

సారాంశం

గూఢచర్యానికి పాల్పడ్డాడనే ఆరోపణ మీద  భారత దేశానికి చెందిన కుల్ భూషణ్ యాదవ్ కు పాకిస్తాన్ సైనిక కోర్టు  విధించిన  మరణ శిక్షను ఈ రోజు   చీఫ్ ఆప్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఖమర్ జావేద్ బాజ్వా ధృవీకరించారు.

గూఢచర్యానికి పాల్పడ్డాడనే ఆరోపణ మీద  భారత దేశానికి చెందిన కల్ భూషణ్ సుధీర్ యాదవ్  అలియాస్  హుసేన్ ముబారక్ కు పాకిస్తాన్  సైనిక కొర్టు ఉరి శిక్ష ఖారారు చేసింది.   ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్  తీర్పును  ఈ రోజు  చీఫ్ ఆప్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఖమర్ జావేద్ బాజ్వా ధృవీకరించారు.


గతంలో పాకిస్తాన్  ఆర్మీ చట్టం ప్రకారం ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్  ఆయనకు మరణ శిక్ష విధించింది.

 


ఇరాన్ ద్వారా పాకిస్తాన్ లోకి అక్రమంగా ప్రవేశించాడనే  ఆరోపణతో 2016 మార్చి 3 ఆయనను  బలోచిస్తాన్ ప్రాంతం అరెస్టు చేశారు. ఆయన భారత దేశానికి చెందిన  రీసెర్చ్ అండ్ అనాలిస్ (ఆర్ ఎ డబ్య్లు) తరఫున గూఢచర్యానికి పాల్పడుతున్నాడని పాకిస్తాన్ ఆరోపిస్తున్నది. బలోచిస్తాన్ ప్రాంతంలో , కరాచిలో ఈ గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు పాక్ ఆరోపిస్తున్నది.

 

 

కుల్ భూషణ్ ఎపుడో నేవీలో ఉద్యోగం మానేసి వ్యాపారం చేసుకుంటున్నాడనిచె భారత్ చెబుతున్నది987లో యాదవ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో చేరాడు.  14 సంవత్సరాల సర్వీసు తర్వాత ఆయన ఇరాన్ లోని ఛహబర్ ప్రాంతంలో వ్యాపారం చేసుకుంటుండేవాడని చెబుతారు. అతనిని పాక్ గూఢచారులు ఇరాన్ నుంచి కిడ్నాప్ చేసుకువెళ్లారని భారత్ ఆరోపణ.

 అతని దగ్గిర మారుపేరుతో పాస్ పోర్ట్ (L9630722)ఉండటంతో పాకిస్తాన్ ఆయనని ‘రా’ ఏజంటని విశ్వసిస్తున్నది.

 

లోగుట్టు ఇది అంటున్నారు

 

గూఢచారి కేసులు దశాబ్దాల తరబడి నానుతున్నపుడు పాకిస్తాన్ ఒక ఏడాదిలోపే కుల్ భూషణ్ కు ఉరిశిక్ష విధించడం  ఆశ్చర్యం. అయితే, దీని వెనక ఏదో మతలబు వుందని చాలా మంది అనుమానిస్తున్నారు.  కుల్ భూషణ్అరెస్టయిన నెలరోజుల్లో పాకిస్తాన్ సైనికాధికారి లెఫ్టినెంట్ కర్నల్ మహమ్మద్ హబీబ్ నేపాల్ లో మాయమయ్యాడు. అతగాడు  ఇండియా సెక్యురిటీ అధికారుల కస్టడీలో ఉన్నాడని పాక్ అనుమానం. హబీబ్ 2014లో సైన్యం నుంచి రిటైరయి నేపాల్ లో ప్రయివేటు ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ( రెండు కేసులలో పోలిక చూడండి) ఇలాంటి వ్యక్తి గత ఏప్రిల్ నేపాల్ లోని లుంబిని లో మాయమయ్యాడు.  హబీబ్ వివరాలు రాబట్టేందుకు లేదా పరస్పరం మార్చుకునేందుకు భారత్ మీద వత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగా  పాకిస్తాన్ ఏడాదిలోనే కుల్ భూషణ్ కేసు ను విచారించి ఉరి శిక్ష విధించి వుండవచ్చని దౌత్యవర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.


కుల్  భూషణ్ మరణ  శిక్ష వార్తను ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ఒకప్రకటనలో వెల్లడించింది.
 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !