పాక్ మంత్రివర్గంలో హిందువు కు చోటు..

First Published 5, Aug 2017, 11:04 AM IST
Highlights
  • గడిచిన 20ఏళ్లలో ఒక హిందువు పాకిస్థాన్ లో ఉన్నత పదవిని దక్కించుకోవడం ఇదే తొలిసారి
  • ఆయన గెలవడం ఇది వరసగా రెండోసారి

 

పాకిస్థాన్ నూతన మంత్రి వర్గంలో తొలిసారిగా ఒక హిందువుకి చోటు దక్కింది. గడిచిన 20ఏళ్లలో ఒక హిందువు పాకిస్థాన్ లో ఉన్నత పదవిని దక్కించుకోవడం ఇదే తొలిసారి. వివరాల్లోకి వెళితే.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొని పాకిస్థాన్ ప్రధాని పదవి నవాజ్ షరీఫ్  రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన స్థానంలో షాహిద్ ఖాకన్ అబ్బాసీ పదవీ బాధ్యత చెప్పట్టారు.

నేడు నూతన మంత్రివర్గం ఏర్పాటు చేశారు.ఈ మంత్రి వర్గంలో దర్శన్ లాల్ అనే హిందువుకు చోటు దక్కింది. మొత్తం 47మందితో నూతన మంత్రి వర్గం ఏర్పాటు చేయగా.. అందులో 28మంది ఫెడరల్ మంత్రులు, 18మంది సహాయక మంత్రులు ఉన్నారు. పాకిస్థాన్ లోని నాలుగు ప్రావిన్స్ లను సమన్వయం చేసే బాధ్యత మంత్రి దర్శన్ లాల్ కి అప్పగించినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.

దర్శన్ లాల్ మీర్ పూర్ మథేల్ పట్టణానికి చెందిన వాడని.. ఆయన వృత్తి రిత్యా డాక్టర్ అని  వారు తెలిపారు. 2013 పాక్ పార్లమెంట్ కి  పీఎంఎల్ ఎన్ టికెట్ పై ఆయన గెలవడం ఇది వరసగా రెండోసారి కావడం విశేషం. 2018లో పాక్ లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా ప్రధాని అబ్బాసీ ఈ మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారే.

Last Updated 25, Mar 2018, 11:52 PM IST