ఏపి గొఱ్ఱెలు, మేకలకు తెలంగాణాలో డిమాండ్

Published : Apr 20, 2017, 03:49 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
ఏపి గొఱ్ఱెలు, మేకలకు తెలంగాణాలో డిమాండ్

సారాంశం

కెసిఆర్ చెప్పిన ప్రకారమే తెలంగాణా మొత్తం మీద 45 లక్షల మేకలు, గొఱ్ణుల పంపిణీ జరగాలి. అందుకని ఏపిలోని నెల్లూరు, కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి, ప్రకాశం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోని సంబంధిత అధికారులను సంప్రదిస్తున్నారు.

ఆంధ్రా గొఱ్ఱెలకు, మేకలకు తెలంగాణాలో బాగా డిమాండ్ పెరిగిపోతోంది.  తెలంగాణాలోని సంబంధిత సామాజిక వర్గాలకు మేకలు, గొఱ్ఱెలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న నిర్ణయమే ఆంధ్రాలో వాటికి డిమాండ్ పెంచేస్తోంది. తెలంగాణాలోని నల్గొండ, ఖమ్మ, మహబూబ్ నగర్ జిల్లాల్లోని సామాజిక వర్గాలకు పంపిణీ చేయాల్సిన  గొఱ్ఱెలు, మేకలు లక్షల సంఖ్యలో అవసరం అవుతుంది. పంపిణీకి అవసరమైన సంఖ్య తెలంగాణాలో లేదు. అందుకని ఏపిలోని వివిధ జిల్లాల నుండి అవకాశమున్నంతలో సేకరించి తీసుకురావాల్సిందిగా తెలంగాణా ప్రభుత్వం యానిమల్ హస్బెండరీ విభాగానికి ఆదేశాలు జారీ చేసింది.

దాంతో సంబంధిత శాఖ అడిషినల్ డైరెక్టర్లు ఏపిలోని నెల్లూరు, కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి, ప్రకాశం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోని సంబంధిత అధికారులను సంప్రదిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం ఒక్క ఖమ్మం జిల్లాలోనే మేకలు, గొఱ్ఱెలు కలిపి సుమారు  1.5 లక్షలదాకా అవసరమవుతుంది. మిగిలిన మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు ఇంకా ఎక్కువ అవసరం అవుతుందట.

కెసిఆర్ చెప్పిన ప్రకారమే తెలంగాణా మొత్తం మీద 45 లక్షల మేకలు, గొఱ్ణుల పంపిణీ జరగాలి. అందుకోసమని రూ. 2600 కోట్లు వ్యయం చేస్తున్నట్లు కూడా ఇప్పటికే ప్రకటించారు. అంతపెద్ద మొత్తంలో ఒక్క ఏపి నుండే సేకరించటం కష్టం కావటంతో అధికారులు మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోని అక్కడి శాఖల అధికారులను కూడా సంప్రదిస్తున్నారు. తెలంగాణా అవసరాలను దృష్టిలో పెట్టుకున్న మేకలు, గొఱ్ఱెల పెంపకందార్లు, సొసైటీలు ఇదే అవకాశంగా ధరలను అమాంతం పెంచేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఏపి మేకలు, గొఱ్ణులకు తెలంగాణాలో విపరీతమైన డిమాండ్ మొదలైంది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !