(video) గేల్ బ్యాట్ మీద ఉప్పు ఎందుకు చల్లాడో తెలుసా..?

Published : Apr 19, 2017, 12:50 PM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
(video) గేల్ బ్యాట్ మీద ఉప్పు ఎందుకు చల్లాడో తెలుసా..?

సారాంశం

హాఫ్ సెంచరీ దాటాక గతంలోలాగా గంగ్నామ్ స్టైల్ స్టెప్పులు వేయకుండా తన బ్యాట్ పై ఉప్పు చల్లాడు.

యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఆన్ ఫీల్డ్ లోనే కాదు ఆఫ్ ఫీల్డ్ లో కూడా ఏం చేసినా సంచలనమే.ఐపీఎల్ 10 లో అతనే ప్రధాన ఆకర్షణ అనడంలో ఏలాంటి సందేహం లేదు. విధ్వంసకర బ్యాటింగ్ విన్యాలతోనే కాదు విభిన్న స్టైల్స్ తో అభిమానులను అలరించడం ఈ సిక్స్ మెషిన్ కు అలవాటు.

 

ఫామ్ లో లేక జట్టులో చోటు కోల్పోయిన గేల్ నిన్న గుజరాత్ లయన్స్ తో మ్యాచ్ లో డివిలియర్స్ అందుబాటులో లేకపోవడంతో  అవకాశం దక్కించుకున్నాడు.10 వేల మైలురాయికి దగ్గర్లో ఉండటంతో ఈ మ్యాచ్ పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలను ఏ మాత్రం వమ్ము చేయకుండా గేల్ చెలరేగిపోయాడు.

 

38 బంతుల్లో 77 పరుగులు చేసి  టీ20 కెరీర్‌లో 10,000 పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా అవతరించాడు.అయితే హాఫ్ సెంచరీ దాటాక గతంలోలాగా గంగ్నామ్ స్టైల్ స్టెప్పులు వేయకుండా తన బ్యాట్ పై ఉప్పు చల్లాడు.

 

దీని గురించి ఏంటా అని ఆరాతీస్తే... ఓ కొత్త విషయం బయటకొచ్చింది. ఇలా ఉప్పు చల్లడాన్ని  ‘సాల్ట్‌ బీ’ స్టైల్‌ అంటారట.

 

టర్కీలోని చాలా రెస్టారెంట్ లలో మాంసాన్ని వండేముందు దానిపై రెండు దెబ్బలు వేసి ఉప్పు చల్లుతారట. ఇది చాలా ఫెమస్ అయిపోయింది. ఫుట్ బాల్ ఆటగాళ్లు గోల్ కొట్టగానే ఇలానే ఉప్పు జల్లి తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటారట. ఇప్పుడు గేల్ ఈ స్టైల్ ను ఇండియాకు పరిచయం చేశాడు. ఇక ఎంతమంది క్రికెటర్లు గేల్ ను ఫాలోఅవుతారో చూడాలి.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !