క్రిటికల్ ఇల్ నెస్ కి ఇన్సూరెన్స్.. ఇలా ఎంచుకోండి

Published : Oct 25, 2017, 11:02 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
క్రిటికల్ ఇల్ నెస్ కి ఇన్సూరెన్స్.. ఇలా ఎంచుకోండి

సారాంశం

వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఆ వ్యాధుల చికిత్స అయ్యే ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. వీటిని తట్టుకోగలగాలంటే.. ఆరోగ్య భీమా చాలా అవసరం

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు.. ఇలా రకరకాల కారణాలతో అనేక వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఆ వ్యాధుల చికిత్స అయ్యే ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. వీటిని తట్టుకోగలగాలంటే.. ఆరోగ్య భీమా చాలా అవసరం. అయితే.. అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ లు అన్ని రకాల చికిత్సలకు పనికిరావు. మరి క్యాన్సర్, కిడ్నీ సంబంధిత వ్యాధులు లాంటి క్రిటికల్ ఇల్ నెస్ వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి. ఇలాంటి జబ్బులకు చికిత్స అందించాంటే.. ఏ ఇన్సూరెన్స్ కి అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం...

పాలసీని పూర్తిగా చదవాలి...

ఏదైనా హెల్త్ పాలసీని తీసుకునే ముందు.. ఆ పాలసీలో ఎలాంటి జబ్బులకు కవర్ అవుతుందో చూసుకోవాలి. కంపెనీ కంపెనీకి ఇందులో తేడాలు ఉంటాయి. ఒక కంపెనీ తమ హెల్త్ పాలసీలో 10రకాల జబ్బులను కవర్ చేస్తే.. మరో కంపెనీ 20రకాల జబ్బులను కవర్ చేస్తాయి. కాబట్టి.. అవన్నీ సరిగా చూసుకొని ఆ తర్వాతే పాలసీని ఎంచుకోవాలి. క్రిటికల్ ఇల్ నెస్ హెల్త్ పాలసీలో క్యాన్సర్, హార్ట్ ఎటాక్, కిడ్నీ సంబంధిత వ్యాధులు తదితర జబ్బులు ఉంటాయి. మీ హెల్త్ ప్రొఫైల్ ని ఒకసారి చెక్ చేసుకొని.. ఏ జబ్బులు వచ్చే అవకాశం ఉందో ఆలోచించుకోవాలి. ఆ తర్వాత దానికి సరిపోను పాలసీని ఎంచుకోవాలి.

క్రిటికల్ ఇల్ నెస్ కవర్ చాలా అవసరం..

సాధారణ హెల్త్ పాలసీలో కవర్ కానీ కొన్ని ఖర్చులు.. ఈ క్రిటికల్ ఇల్ నెస్ కవర్ లో కవర్ అవుతాయి. తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు వ్యక్తి.. ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితి లేదా.. ఉద్యోగానికి సెలవు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఈ క్రిటికల్ ఇల్ నెస్ కేర్ పాలసీ.. మెడికల్ ఖర్చులతోపాటు, వ్యక్తి రోజువారీ ఖర్చులను కూడా భరిస్తుంది. మీరు ఎంచుకున్న కంపెనీని బట్టి ఈ పాలసీ ఉంటుంది. కొన్ని కంపెనీలు.. ప్రత్యామ్నాయ వైద్యఖర్చులకు, స్పెషల్ డాక్టర్లు అవసరమైనా అలాంటి ఖర్చులను కూడా ఈ పాలసీ కవర్ చేస్తుంది. మెడికల్ టెస్టులు, చెకప్స్ వంటి ఖర్చు కూడా భరిస్తుంది.

పాలసీ ఎంత కవర్ అవుతుందో చూసుకోవాలి..

ఈ క్రిటికల్ ఇల్ నెస్ కవర్ పాలసీని ఎంచుకునే సమయంలో.. ఆ పాలసీ ఎంత ఎమౌంట్ వరకు కవర్ అవుతుందో చూసుకోవాలి. ఉదాహరణకు మీరు ఏదైనా గుండె సంబంధిత వ్యాధి వచ్చే అవకాశం ఉంది అని అనుకుంటే.. దానికి రూ.15లక్షల వరకు ఖర్చు అవుతుందని అనుకుందాం. అదే సమయంలో మీరు మీ కుటుంబానికి ఆర్థికంగా సహకరించాలనుకుందాం. అప్పుడు మీరు ఆరోగ్య బీమా తీసుకుంటారు. అవునా. ఆ పాలసీ.. మీ వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం భరించేలా చూసుకోవాలి. ఆ పాలసీ క్లైమ్ చేసుకునే సమయంలో ఆసల్యం జరిగినా... ఆ సమయంలో మీ కుటుంబానికి ఆర్థికంగా సహాయపడాలన్నా.. మీకు క్రిటికల్ ఇలెనెస్ కేర్ ఇన్సూరెన్స్ సహాయపడుతుంది. ముందుగానే డబ్బు అందిస్తుంది. దీంతో అటు వ్యక్తికి చికిత్స , ఇటు కుటుంబ ఆర్థిక అవసరాలు.. రెండూ తీరతాయి.

పాలసీ ఎలా తీసుకుంటున్నారు..?

క్రిటికల్ ఇన్సూరెన్స్ ని రెండు రకాలుగా తీసుకోవచ్చు. మీ ఇన్సరెన్స్ కంపెనీ నుచి స్టాన్డ్ ఎలోన్ గా అయినా తీసుకోవచ్చు.. లేదా మీ జీవిత, ఆరోగ్య భీమా రైడర్ పాలసీని కూడా తీసుకోవచ్చు. రైడర్ విధానంలో తీసుకుంటే.. పాలసీ పీరియడ్ ముగిసే వరకు ప్రీమియమ్ అంతా ఒకేవిధంగా ఉంటుంది. అలా కాకుండా సాధారణ భీమా కంపెనీ నుంచి విడిగా తీసుకుంటే పాలసీ ధర వయసుతోపాటు పెరుగుతూ ఉంటుంది. ఈ రెండు రకాల పాలసీ విధానం గురించి పూర్తిగా తెలుసుకొని.. వాటికి సంబంధించిన పత్రాలను పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే పాలసీని తీసుకోవాలి.

పాలసీలో ఏవి కవర్ కావు?

క్రిటికల్ ఇల్ నెస్ పాలసీని తీసుకునే ముందు.. అసలు పాలసీ కిందకు ఎలాంటివి వర్తించవో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పాలసీని తీసుకున్న 60రోజుల్లోపు( కొన్ని కంపెనీలు 30రోజులు) దానిని క్లైమ్ చేసుకునే అవకాశం ఉండదు. ముందుగానే ఉన్న జబ్బులకు ఈ పాలసీ వర్తించదు. అదేవిధంగా డెంటల్ ట్రీట్ మెంట్, జెండర్ మార్పు, గ్యాస్ట్రిక్, క్యాటరాక్ట్ వంటివాటికి ఈ పాలసీ వర్తించదు.

క్రిటికల్ ఇల్ నెస్ ప్లాన్స్..కొంత వెయిటింగ్ పీరియడ్ కలిగి ఉంటాయి. ఆ పీరియడ్ ముగిసిన తర్వాతే ఆ పాలసీని క్లైమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సాదారణంగా బీమా సంస్థలు పాలసీ తీసుకున్న నాటి నుంచి 90రోజులు వెయిట్ చేయాల్సిందిగా చెబుతుంటాయి. అదేవిధంగా ఈ క్రిటికల్ ఇల్ నెస్ పాలసీలో సర్వైవల్య క్లాజ్ ని జత చేస్తారు. ఈ పాలసీలో సర్వైవల్ పీరియడ్ దాదాపు అన్ని కంపెనీల్లో 30రోజులు ఉంటుంది. కొన్ని బీమా కంపెనీలు అన్ని రోగాలకు పూర్తి స్థాయిలో బీమా మొత్తాన్ని చెల్లించవు. కాబట్టి.. పాలసీని తీసుకునే సమయంలో అన్ని గురించి పూర్తి సమాచారం తెలుసుకొని.. ఆ తర్వాత మీకు సరిపోయే క్లైమ్ ని ఎంచుకోవాలి.

 

అథిల్ శెట్టి, బ్యాంక్ బజార్.కామ్, సీఈవో

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !