ఫుడ్ ఇందులోనే ఎందుకు ప్యాక్ చేస్తారు..?

First Published Nov 25, 2017, 12:35 PM IST
Highlights
  • నిజానికి ఫుడ్ త్వరగా ఆరిపోకుండా ఉండేందుకు దుకాణదారులు ఈ ఈ కవర్లతో పార్శిల్ చేస్తుంటారు.
  • ఈ కవర్లని అల్యూమినియం మెటల్ తో తయారు చేస్తారు. ఇది లైట్, ఆక్సీజన్ కి అవరధోకంగా పనిచేస్తుంది.
  • దీంతో దానితో తయారు చేసిన పార్శిల్ కవర్లలో ఫుడ్ పెడితే.. ఆ ఫుడ్ రుచి, వాసన, వేడి తగ్గకుండా చేస్తుంది.

ఈరోజు ఇంట్లో వంట చేసే ఓపిక లేదనుకోండి వెంటనే బయట నుంచి పార్శిల్ తెచ్చుకుంటారు. టిఫిన్, కటెలెట్, బిర్యానీ ఇలా ఫుడ్ ఏదైనా మనకు పార్శిల్ రూపంలో లభిస్తూనే ఉన్నాయి. అయితే.. మీరు గమనించారో లేదో... ఫుడ్ ఏదైనా పార్శిల్ మాత్రం ఒకేవిధంగా చేస్తుంటారు. అదేనండి.. అల్యూమినియం తో తయారు చేసిన కవర్లు, బాక్సుల్లో పార్శిల్ చేసి ఇస్తుంటారు. వీటిల్లోనే ఎందుకు చేస్తున్నారు అనే సందేహం ఎప్పుడైనా మీకు కలిగిందా..? ఈ అల్యూమినియంతో రేకుతో తయారు చేసిన ఈ పార్శిల్ కవర్స్ నిజంగా సురక్షితమేనా? కాదా?

నిజానికి ఫుడ్ త్వరగా ఆరిపోకుండా ఉండేందుకు దుకాణదారులు ఈ ఈ కవర్లతో పార్శిల్ చేస్తుంటారు. ఈ కవర్లని అల్యూమినియం మెటల్ తో తయారు చేస్తారు. ఇది లైట్, ఆక్సీజన్ కి అవరధోకంగా పనిచేస్తుంది. దీంతో దానితో తయారు చేసిన పార్శిల్ కవర్లలో ఫుడ్ పెడితే.. ఆ ఫుడ్ రుచి, వాసన, వేడి తగ్గకుండా చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఫుడ్ త్వరగా పాడవ్వదు. మాములు వాటితో పోలిస్తే.. వీటిల్లో ఫుడ్ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అందుకే ఎక్కువ శాతం ఫుడ్ పార్శిల్స్ కి ఇవే ఉపయోగిస్తారు. కేవలం ఫుడ్ పార్శిల్స్ కి మాత్రమే పరిమితం కాలేదు. ఈ అల్యూమినియం రేకులను ఇంటి కిటికీలకు పెట్టుకుంటే.. ఎండకాలంలో చల్లగానూ, చలికాలంలో వేడిగానూ ఉంటుంది.

అయితే.. ఈ అల్యూమినియం రేకుతోతయారు చేసిన కవర్లలో ఫుడ్ ఉంచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే.. ఈ అల్లూమినియం రేకు ఆహారాన్ని వేడిగా ఉంచుతుంది అన్నది నిజం. అయితే.. ఆహారాన్ని డైరెక్ట్ గా అందులో పెట్టడం మంచిది కాదు అంటున్నారు ఆహార నిపుణులు. వేరే ఏదైనా వస్తువుతో పార్శిల్ బాక్స్ తయారు చేసి.. దానికి అల్యూమినియం కవర్ వేసి తయారు చేస్తే అలాంటి వాటిలో ఫుడ్ పెడితే మంచిదని చెబుతున్నారు నిపుణులు. అలా అయితే.. ఫుడ్ ఎక్కువ సమయం వేడిగా కూడా ఉంటుంది. వెన్న రాసిన కాగితాల్లో ఆహారాన్ని ఉంచి.. చివరగా అల్యూమినియం కవర్ తో పార్శిల్ చేస్తే మంచిది. కేవలం వేడి పదార్థాలను వేడిగా ఉంచడమే కాదు.. చల్లటి పదార్థానాలను చల్లగా కూడా ఉంచుతుంది.

దీనివల్ల లాభాలే కాదండి.. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. చాలా మంది వీటిల్లో ఫుడ్ వేడిగా ఉంటికదా అని ఉంచాల్సిన సమయానికి మించి ఉంచుతుంటారు. అది చాలా ప్రమాదకరం. అల్యూమనియం పార్శిల్స్ లో నైనా మూడు లేదా నాలుగు గంటలకు మించి ఆహారాన్ని నిల్వ ఉంచకూడదు. అలా ఉంచితే.. అందులో బ్యాక్టీరియా తయారయ్యే అవకాశం ఉంటుంది. దీంతో.. అలాంటి ఆహారం తీసుకుంటే వాంతులు, విరేచనాలు, ఫుడ్ పాయిజినింగ్ లాంటివి అవుతుంటాయి. 

click me!