రోహిత్ వేముల కోసం...

Published : Jan 10, 2017, 03:59 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
రోహిత్  వేముల కోసం...

సారాంశం

రోహిత్  దళితుడు కాదని, బిసి అని అధికారికంగా ప్రకటించేందుకు రంగం సిద్దమవుతూ ఉంది

 రోహిత్‌ వేముల ఆత్మహత్య చేసుకుని ఏడాది కావస్తున్నది.


ఏడాదిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాగా శ్రమించి, చనిపోయాక కూడా ఆయనను వేధించేందుకు, తద్వార కొంత మందినేరస్థులను కాపాడేందుకు ప్రయత్నాలు ముమ్మురంగా సాగిస్తున్నాయి.

 

 రోహిత్  కేసు తేలడలేదు. రోహిత్ డిమాండ్లు అలాగే ఉన్నాయి.  అయితే, ఆత్యహత్యకు కారకులైన వారిని శిక్షించడానికి బదులు రక్షించేందుకు  ప్రభుత్వాలు  ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. మాకు అందుతున్న సమాచారం ప్రకారం, తొందర్లో  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రోహిత్ దళితుడు కాదు, బిసి అని అధికారికంగా ముద్రవేసేందుకు  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు పోతున్నది.


గుంటూరు కలెక్టర్ దీనికోసం రంగం సిద్ధం చేశారని, పైనుంచి ఉత్తర్వులు రాగానే ఒక నివేదిక రూపంలో కోర్టుకో, ఎస్ సి కమిషన్ కో ఈ ’పచ్చి నిజ‘ సమర్పించి లీక్ చేస్తారు లేదా కాపీ అంందిస్తారు.


అపుడు రోహిత్ , రోహిత్ కుటుంబం తప్పుడు సర్టిఫికెట్ సృష్టించారని  కేసు పెట్ట వచ్చు. విశ్వవిద్యాలయాన్ని జాతి వ్యతిరేకం కేంద్రం చేసేందుకు ప్రయత్నించారని కుట్రకేసుకూడా పెట్ట వచ్చు.


కేంద్రమంత్రులను కాపాడుకునేందుకు కేంద్రం చాలా బాగా ప్రయత్నిస్తూ ఉంది.


పోలవరం ప్రసాదించినందుకు కేంద్రం ఏదడిగినా చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వమూ సిద్ధంగా వుంది. అందువల్ల రోహిత్ బిసి అని, దళితుడు కాదు అని సాక్షాధారాలు సంపాదించడం, అందునా గుంటూరు జిల్లాలో ఏమంతపెద్ద  పనికాదు.


ఈ కుట్రను భగ్నం చేసేందుకు జనవరి 17 న జాతీయ నిరసన దినం పాటించాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ రోహిత్ మిత్రులు, యూనివర్శిటీని  అగ్రకుల అభయారణ్యంగా మార్చడానికి వ్యతిరేకంగాపోరాడుతున్న వాళ్లు నిర్ణయించారు.


నిజానికి ఈ మధ్య హైదరాబాద్ యూనివర్శిటీ పదవి ఇంతగా రాజకీయయింది. గతంలో తెలుగు పార్టీలు హెచ్ సి యు, మీద గాని, ఇఫ్లూ మీద గాని ఇంత శ్రద్ధ చూపనేలేదు. 2014 లో హెచ్ సియు లో తెలుగు రాజకీయ యుగం మొదలయిందని చెబుతున్నారు.


రోహిత్‌ మరణించిన రోజును దళిత హక్కుల పోరాట దినంగా ప్రకటించాలని వివిధ ప్రజా, దళిత సంఘాలు ఒక వైపు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.


వివాదాస్పదమయిన హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ అప్పారావుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దగ్గరుండి మరీ ప్రధాన మంత్రి చేతుల మీదుగా సన్మానం చేయించడం ఈ కుట్రలో భాగమని, అప్పారావుకు  హాని జరగకుండా చూడమని ప్రధానిని కోరడమేనని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.


రోహిత్ తన రెండున్నర దశాబ్దాల జీవితాన్ని కాదని, ఎపుడో వదిలేసిన ఆయన తండ్రి కులాన్ని  ప్రధానం చేసి మొత్తం వ్యవహారాన్ని జాతి వ్యతిరేక మూకల గొడవగా చూపేందుకు  కృషి జరగుతుూ ఉందని నిరసన పాటిస్తున్న విద్యార్థి నాయకులు చెబుతున్నారు.
 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !