
సమాజ్‌వాది పార్టీలో సంక్షోభం ముగిసింది. తండ్రికొడుకుల తగాదాతో పార్టీ రెండు ముక్కలుగా విడిపోతుందని భావిస్తున్న తరుణంలో
ములాయం పెద్ద మనసు చేసుకున్నారు. సైకిల్ ను కొడుకుకే ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ సీఎం అభ్యర్థిగా అఖిలేష్ యాదవ్ ఉంటారని ప్రకటించారు.
ఎన్నికల తర్వాతనే సీఎం ఎవరనేది ప్రకటించడం జరుగుతుందని మొదట చెప్పిన ములాయం ఇప్పుడు మాట మార్చారు. అఖిలేష్ ను సీఎం అభ్యర్థిగా ప్రచారం చేస్తామని వెల్లడించారు.
పార్టీలో చీలిక అనే ప్రశ్న లేదని, తామంతా ఒక్కటేనని, ఇక ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తామని పేర్కొన్నారు.