
మీఠా పాన్, జర్ధా పాన్, కలకత్తా పాన్, మసాలా పాన్ ఇలా చెప్పుకుంటూ పోతే పాన్ లు పలురకాలు అని మనకు తెలిసిందే.
కానీ, మంటలతో రగిలిపోయే పాన్ ను ఎప్పుడైనా చూశారా... చూడకపోతే ఢిల్లీకి వెళ్లాల్సిందే. అక్కడ చాలా పేరున్న కన్నాట్ ప్లేస్ కు వస్తే ఈ ఫైర్ పాన్ ను తయారు చేసే కిల్లీ కొట్టును చూడొచ్చు.
తమలపాకుపై కర్పూరం వెలిగించి దేవుడికి హారతి ఇవ్వడం మాత్రమే మనకు తెలుసు... ఈ పాన్ వాలా మరీ వెరైటీ... తమలపాకు పై అగ్గిరాజేసి కిల్లీ అడిగినోడి నోట్లు కుక్కేస్తున్నాడు.
ఖరీదు తక్కువే అయినా ఒంట్లో కాస్త ఖలేజా ఉంటేనే ఈ పాన్ ను తినగలరు.