టిడిపి ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి హఠాన్మరణం

First Published Mar 12, 2017, 7:00 AM IST
Highlights

ఈ తెల్లవారు జామున గుండెపోటు. ఉదయం మృతి

నంద్యాల ఇప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి చెందారు. ఈ తెల్లవారు జామున తీవ్ర అస్వస్తతకు గురయ్యారు. ఆయనకు  తీవ్ర గుండెపోటు వచ్చింది. ఆళ్లగడ్డలో ప్రాథమిక చికిత్స అనంతరం నాగిరెడ్డిని 108 వాహనంలో మొదట నంద్యాలలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు.   ఆయన పరిస్థితి చాలా  విషమం అని చెప్పారు. తర్వాత ఆయన బావమరది ఎస్ వి మోహన్ రెడ్ది భూమా మరణించినట్లు ప్రకటించారు.  

 

ఆయన నంద్యాల సురక్షిత అసుపత్రికి తీసుకువచ్చే టప్పటికే మృతి చెందారని  డాక్టర్లు చెబుతున్నారు.

 

రేపు ఆళ్లగడ్డలో అంత్యక్రియలు జరుగుతాయి.

 

2014లో వైసిసి (ఫోటో) తరఫున గెలుపొందినా గత ఏడాది ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. గత వారం శాసన మండలి ఎన్నికల ప్రచారంలో ఈ వత్తిడి వల్లే అనారోగ్యానికి లోనయ్యారని చెబుతున్నారు.


ఈ సమాచారం అందగానే అహోబిలంలో ఉన్న కూతరు నుంచి అఖిల ప్రియ హుటాహుటిన నంద్యాల వచ్చారు.


నాగిరెడ్డి ఆరోగ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరా తీశారు. అవసరమయితే హెలికాప్టర్ లో ఆయనను  మరొక చోటికి మెరుగయిన చికిత్స కోసం తరలించాలని నాయుడు ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్త రాస్తున్నప్పటికి ఆయన నంద్యాల ఆసుపత్రిలోనే ఉన్నారు. స్పృహలో లేడని కూడా చెబుతున్నారు.
 ఈ సమాచారం తెలియగాననే పెద్ద ఎత్తున అభిమానులు నంద్యాల చేరుకుంటున్నారు.

***

భూమా నాగిరెడ్డి  1964 జనవరి 8 న దోర్నిపాడు లో జన్మించారు. ఈయన 1992 లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మధ్యంతర ఎన్నికలలో ఎన్నికయ్యారు.  ఎమ్మెల్యే సోదరుడుభూమా శేఖర్ రెడ్డి   ఆకస్మిక మరణంతో జరిగిన ఆళ్లగడ్డ ఉప ఎన్నికలలో గెల్చి ఎమ్మెల్యే అయ్యాడు. 

 

1996 లో నంద్యాల లోక్స భ స్థానానికి  జరగుతున్న ఉప ఎన్నికలో ప్రధానమంత్రి పి.వి.నరసింహారావుపై పోటీ చేసేందుకు తెలుగుదేశం భూమా ను ఎంపిక చేసింది. ఈయన లోక్‌సభ సభ్యునిగా మూడు అంటే 11, 12, 13  లోక్ సభలకు  ఎన్నికయ్యారు.


 

రాయలసీమలో అందునా ముఖ్యంగా కర్నూల్ జిల్లాలోని ఒక బలమయిన రాజకీయ ముఠాకు ఆయన నాయకుడుగా ఉన్నారు. గతంలో టాడా చట్టం కింద కూడ అరెస్టయ్యారు. కెసి కెనాల్ నీళ్లతో సారవంతమయిన ఆళ్లగడ్డ నియోజకవర్గంమీద పెత్తనం కోసం భూమాకు, ప్రత్యర్థి గంగుల ప్రతాఫ రెడ్డి కుటుంబానికి రక్తసిక్తమయిన పోటీ ఉండింది.

 

ఈ పోటీ ఎన్నిహత్యలకు దారితీసిందో లేక్కే లేదు. దందాగిరి, మామూళ్లు వసూలు చేయడం, పాశవిక దాడులు, బాంబులు, తుపాకులు, హత్యలు  ఈ ప్రాంత రాజకీయ సంస్కృతి. ప్రత్యర్థిని లేపేయడమనేది ఇక్కడి రాజకీయ ంలో క్రియాశీల  కార్యక్రమం.

 

ఈ కుటుంబాలన్నీ వ్యవసాయం నుంచి బయటపడి ఇతరవ్యాపారాలలోకి  విస్తరించడంతో ముఠా కక్షలు తీవ్రత కొంత తగ్గింది. ఇది రాజధాని వ్యూహాలకు మారింది.

 

ముఠా కక్షలకంటే వ్యాపార ప్రయోజనాలు ముఖ్యం కావడంతో సులభంగా పార్టీలు మారడానికి అలవాటు పడ్డారు.  గంగుల కుటుంబానికి చెందిన ప్రభాకర్ రెడ్డి మొన్నమొన్నటిదాకా తెలుగుదేశం లో ఉన్నాడు. అంటే,భూమా,గంగుల ఒకేపార్టీలో ఉండేందుకు కూడా సిద్ధమయ్యారన్నమాట.

 

ఈ మధ్య కౌన్సిల్ ఎన్నికలలో టికెట్ కోసం గంగుల ప్రభాకర్ రెడ్డి వైసిపి లో చేరాడు. వ్యాపార ప్రయోజనాలు, భద్రత కోస భూమా ఆమ ధ్య వైసిపి వదలి టిడిపిలోకి వచ్చాడు.

 

2008 ఎన్నికలలో ఆయన ప్రజారాజ్యం నుంచి లోక్ సభకు పోటీ  చేసి ఓడిపోయారు.

 

ఉగాది సందర్భంగా  జరిగే క్యాబినెట్ విస్తరణలో భూమాకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని అభిమానులు, అనుచరులు ఆశిస్తన్నపుడు ఆయన ఇలా జరిగింది.

 

గత ఎన్నికల పుడు ఆయన భార్య  శోభ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అనంతరం జరిగిన ఎన్నికలలో  కూతరు అఖిల ప్రియ ఆళ్లగడ్డ నుంచి గెలుపొందారు.

 

click me!