చడీ చప్పుడు లేకుండా హరీష్ రావు ఈ పని చేశారు...

First Published Dec 24, 2017, 8:27 PM IST
Highlights

ఒక సోషల్ మీడియా పోస్టుకు మంత్రి హరీష్ సకాలంలో స్పందిచడంతో ఒక పాప జీవితంలో చిరునవ్వులు మళ్లీ ప్రత్యక్షమయ్యాయి

మంత్రి హరీశ్ రావు చడీ చప్పుడు చేయకుండా తన పని తాను చేసుకుపోతుంటాడు. తెలంగాణ వచ్చాక రాజకీయాలు మాట్లాడటం, రాజకీయ వివాదాల్లోప్రోయాక్టివ్ గా తల దూర్చి వార్తల్లో ఉండటం మానే శాడు. ఆయన మీద చాలా బాధ్యత పడింది.  తెలంగాణలో ప్రతి ఇంచి  భూమికి నీరు తెచ్చే పనిలో ఉన్నాడు. ఇదే రేపు  ఆయనను చరిత్రలో నిలబెట్టేది. అందువల్ల  అదే ఆయన ప్రపంచమయింది. అయితే, ఈ రోజు ఒక సర్ ప్రై జ్ న్యూస్ ఆయన ఇంట్లో నుంచి వెలువడింది. అది ఇరిగేషన్ కు సంబంధించి కాదు. ఒక పేదవారి కృతజ్ఞతలకు సంబందించిన కబర్.  ఒక పేద  కుటుంబం మెదక్ జిల్లా తూప్రాన్ నుంచి  మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఆయనను కలసి ధన్యవాదాలు చెప్పింది. తమ కూతురుకు హరీష్  వల్ల పునర్జన్మ లభించిందని చంద్రం కుటుంబం ఆనందబాష్పాల మధ్య మంత్రికి తెలిపింది. పెద్ద జబ్బునుంచి కోలుకున్న చంద్రం కూతరు అక్షయ ను చూసి మంత్రి కూడా మురిసిపోయారు.

అసలు విషయమిది:

మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన   సిందె చంద్రం నిరుపేద. ఆయన ఏడేండ్ల కుమార్తె సిందె అక్షయ క్లిష్టమైన గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నది. చికిత్స కోసం ఎంతమందిని వేడుకున్నా ఎవరూ స్పందించలేదు. దీంతో సోషల్ మీడియా ద్వారా సాయం చేయాలంటూ ఓ లేఖను చంద్రం పోస్ట్ చేశారు. ఈ లేఖ మంత్రి హరీష్ రావు కంట పడింది.

తమకు కనిపిస్తున్న దేవుడు అని ఉమ్మడి మెదక్ జిల్లా తూప్రాన్ కు చెందిన చంద్రం కుటుంబ సభ్యులు అన్నారు. ఆయన అక్షయ గురించి వాకబు చేశారు. పాప తండ్రిని తన నివాసానికి పిలిపించుకొన్నారు. పాపను బతికించుకునేందుకు ఆ తండ్రి చేసిన ప్రయత్నాలను, గతంలో జరిగిన చికిత్సల గురించి మంత్రి తెలుసుకున్నారు.  పాపకు మరోసారి శస్త్రచికిత్స చేయాల్సి వస్తుందని నీలోఫర్ వైద్యులు తెలిపినట్టు అక్షయ తండ్రి తెలిపారు. డాక్టర్ల ద్వారా జబ్బు గురించి వాకబు చేశారు.  తర్వాత చికిత్సకు ఎంత ఖర్చయినా తానే భరిస్తానని హామీ ఇచ్చి, మెరుగైన చికిత్స అందేలా హరీశ్‌రావు ఆదేశాలు జారీచేశారు. మెరుగైన చికిత్స కోసం అక్షయను బంజారాహిల్స్‌లోని కేర్ దవాఖానకు తరలించేలా మంత్రి హరీశ్ రావు ఏర్పాట్లుచేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.4లక్షలు మంజూరు చేయించారు. అక్షయ ఊపిరితిత్తుల వ్యవస్థను బాగుపర్చడంతోపాటు గుండె రక్తనాళానికి స్టంట్ వేయడంతో చిన్నారి అక్షయ పూర్తిగా కోలుకుంది. దవాఖాన నుంచి డిశ్చార్జి అయింది. ఇపుడు పూర్తిగా కొలుకున్నది. ఆదివారం మంత్రి హరీశ్ రావు అక్షయ ఆరోగ్యం తెలుసుకుని హర్షం వ్యక్తం చేశారు.

సోషల్ మీడియా పోస్టు కు స్పందించి ఇంత చొరవ తీసుకుని  మంత్రి చేసిన సాయం ఎన్నటికీ మరిచిపోలేమని చంద్రం చెప్పారు.  కృతజ్ఞతులు వ్యక్తం చేసేందుకే తాము ఆదివారం నాడు మినిస్టర్స్ క్వార్టర్స్ లో హరీష్ రావును కలిసినట్లు చెప్పారు.

 

 

click me!