చంద్రబాబుకి మరో షాక్ ఇచ్చిన కేంద్రం

First Published Dec 24, 2017, 11:29 AM IST
Highlights
  • ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబుకి పెద్ద షాక్ తగిలింది.
  • రాజధాని అమరావతిని రైలు మార్గంతో అనుసంధానించే ప్రాజెక్టు వ్యయం బాధ్యత ఇప్పుడు రాష్ట్రం పై పడింది.

చంద్రబాబునాయుడికి కేంద్ర ప్రభుత్వం షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ పనిచేద్దామనుకున్నా.. అందుకు కేంద్రం అడ్డుపుల్ల వేస్తోంది.  2019 ఎన్నికలు మరెంతో దూరం లో లేవు. మరో వైపు.. ప్రజల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబుకి పెద్ద షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం చేతుల నుంచి కేంద్రం చేతుల్లోకి  వెళ్లే దిశగా చర్యలు జరుగుతున్నాయి . ఇదిలా ఉండగా తాజాగా మరో షాక్ ఇచ్చింది.

విషయం ఏమిటంటే.... రాజధాని అమరావతిని రైలు మార్గంతో అనుసంధానించే ప్రాజెక్టు వ్యయం బాధ్యత ఇప్పుడు రాష్ట్రం పై పడింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ రాజధాని ప్రాంతాన్ని రైలు మార్గంతో అనుసంధానం చేయాలంటూ ఏపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు, అమరావతి-పెదకూరపాడు, నర్సారావుపేట- సత్తెనపల్లి రైలు మార్గం వేయడానికి కేంద్రం ఒప్పుకుంది. అయితే.. ఆ నిర్మాణం వ్యయం కూడా కేంద్రమే భరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ.. దాని పూర్తి వ్యయం తాము భరించలేమని తేల్చేసింది.

ఈ ప్రాజెక్టు వ్యయం రూ.3,272 కోట్లు కాగా.. దీనిలో సగం రాష్ట్రం భరించాలని చెప్పేసింది. సరే.. కేంద్రం కొంత భరించినా.. మరికొంత తాము భరిద్దామనుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ. దీంతో.. ఈ విషయంలో చంద్రబాబు ఏటూ తేల్చుకోలేకపోతున్నారు. పోలవరం విషయంలో కేంద్రం ఇచ్చిన షాక్ కే చంద్రబాబు ఇంకా తేరుకోలేదు. ఇవన్నీ చూస్తుంటే.. కేంద్రం.. రాష్ట్రంపై పగబట్టిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

click me!