అందరి నోటా.. జగ్దీప్ సింగ్ పేరే..!

First Published Aug 26, 2017, 1:20 PM IST
Highlights
  • గత ఏడాది  సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తిగా ఎంపికయ్యారు
  • జడ్జి జగ్దీప్‌సింగ్‌ది చాలా ఉదార స్వభావం.

డేరా సచ్చ సౌద చీఫ్ బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ను అత్యచార కేసులో  దోషిగా తేలుస్తూ.. సీబీఐ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. తీర్పు ఇచ్చిన మరు క్షణమే పోలీసులు గుర్మీత్ ని అరెస్టు చేసి హెలికాప్టర్ లో రోహతక్ జైలుకు తరలించారు. ఇది జరిగిన వెంటనే.. అందరిలోనూ మొదలైన ప్రశ్న.. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి ఎవరు అని.

 గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్.. అందరి లాంటి బాబా కాదు. ఆయన కు రాజకీయ పలుకుబడి చాలా ఎక్కువ. ఆయన చేసే పనులకు ప్రభుత్వం అండగా నిలిచిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అలాంటి వ్యక్తి కి శిక్ష ఖరారు చేయాలంటే ఆ న్యాయమూర్తికి చాలానే ధైర్యం ఉండాలి. అందుకే బాబాకి శిక్ష పడిందనే గానే తీర్పు ఇచ్చిన న్యాయవాది జగ్దీవ్ సింగ్ గురించే చర్చించుకుంటున్నారు.

 

జగ్దీవ్ సింగ్ గురించి రెండు వ్యాఖ్యాల్లో చెప్పమని.. ఆయన సన్నిహితులను ఎవరిని అడిగినా.. చాలా సమర్థవంతమైన వ్యక్తి అని, వృత్తిపట్ల కఠినంగా వ్యవహరిస్తారని  చెబుతున్నారు.

 

జగ్దీప్‌సింగ్‌ 2000 సంవత్సరంలో పంజాబ్‌ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవిద్య పూర్తిచేశారు. చదువుకునే రోజుల్లోనే అనితర ప్రతిభ ప్రదర్శించినట్టు అతని స్నేహితులు చెబుతుంటారు. రెండేళ్లు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు అనంతరం 2012లో హరియాణా జ్యుడిషియల్‌ సర్వీసుకు ఎంపికయ్యారు. జిల్లా అదనపు జడ్జిగా మొదట సోనేపట్‌లో నియమితులయ్యారు. గత ఏడాది 2016లో సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తిగా ఎంపికయ్యారు

 

జడ్జి జగ్దీప్‌సింగ్‌ది చాలా ఉదార స్వభావం. ఇందుకు 2016లో జరిగిన ఓ సంఘటనే నిదర్శణం. గత ఏడాది ఆయన పంచకుల రహదారిపై వస్తుండగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. విచారించగా రోడ్డు ప్రమాదం జరిగిందని కొందరు చెప్పారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని అంబులెన్స్ కు ఫోన్‌ చేశారు. త్వరగా రమ్మని కోరగా అంబులెన్స్ కు రెక్కలుంటాయా అని సదరు సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో జగ్దీప్‌సింగ్‌ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన వాహనంలోనే బాధితులను ఆసుపత్రికి తరలించి వైద్యసౌకర్యం అందించారు.

 

 సాధారణ జీవితాన్ని కోరుకునే సింగ్‌ కేసుల తీర్పుల విషయంలో అన్ని అంశాలను అధ్యయనం చేసి తీర్పు ఇస్తారు. అందుకే రాజకీయాలకు తలొగ్గకుండా.. గుర్మీత్ కేసులో తీర్పు వెలువరించారు.

click me!