కాఫీ అంత పని చేస్తుందా..?

First Published Aug 26, 2017, 12:34 PM IST
Highlights
  • నాలుకపై ఉండే రుచి గులికలు తమ స్వభావాన్ని కోల్పోతాయని నిపుణులు చెబుతున్నారు.
  • కెఫీన్ ఎక్కువగా ఉన్న కాఫీ తాగితే.. అలసట తగ్గిపోయి.. హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది.

 

మీరు కాఫీ ప్రియులా.. రోజుకి కనీసం నాలుగు, ఐదు కప్పుల కాఫీ అయినా తాగకుండా ఉండలేరా.. అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎక్కువగా కాఫీ తాగే వారు రుచిని కోల్పోయే అవకాశం ఉంది.  నాలుకపై ఉండే రుచి గులికలు తమ స్వభావాన్ని కోల్పోతాయని నిపుణులు చెబుతున్నారు. వారి పరిశోధనల ప్రకారం... కాఫీలోని కెఫీన్.. రుచి గులికలు తీపిని గుర్తించకుండా ఉండేలా చేస్తుంది.

 

బాగా అలసట గా, ఒత్తిడిగా అనిపించినప్పుడు చాలా మంది కాఫీ తాగడానికి ఇష్టపడతారు. అయితే.. కెఫీన్ ఎక్కువగా ఉన్న కాఫీ తాగితే.. అలసట తగ్గిపోయి.. హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది. కానీ.. నాలుక రుచిని కోల్పోతుంది. తీపి ఎంత తిన్నా.. నాలుకకు తీయగా అనిపించదట.

 అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాబిన్ డాండో ఈ విషయాలు వెల్లడించారు. కెఫీన్ ఉన్న కాఫీ లేదా ఏదైనా డ్రింక్ తాగిన వెంటనే ఏదైనా ఆహారాన్ని తీసుకున్నట్లయితే.. మీరు ఈ విషయాన్ని గమనించవచ్చని రాబిన్ చెబుతున్నారు.

 ఒక కప్పు కాఫీలో 200 గ్రాముల కెఫీన్ ని వేసి స్ట్రాంగ్ గా తయారు చేసి మరీ పరిశోధన జరిపినట్లు ఆయన వెల్లడించారు. కెఫీన్ ఎక్కవగా ఉన్న కాఫీని ఒక గ్రూప్ సభ్యులకు, తక్కువగా ఉన్న కాఫీ మరో గ్రూప్ సభ్యులకు ఇచ్చామని తె లిపారు. కెఫీన్ ఎక్కువగా ఉన్న కాఫీ తాగిన వారు తమ నాలుక రుచి కోల్పోవడాన్ని గమనించారు.

కాబట్టి.. కాఫీ ప్రియులు.. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. కెఫీన్ తక్కువగా ఉన్న కాఫీ తాగడానికి ఆసక్తి చూపండి.

click me!