సినిమా పేరు మార్చకపోతే.. ఎంత మంది విడిపోయే వాళ్లో..!

First Published Aug 26, 2017, 12:15 PM IST
Highlights
  • ఈ చిత్రానికి మొదట ‘ తలాక్.. తలాక్.. తలాక్’ అనే పేరు పెట్టాలని భావించారట.
  • అందుకే ఆ సినిమా పేరు మార్చారట..!

ఇస్లాం మతాచారమైన ముమ్మారు తలాక్‌పై సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. ముమ్మారు తలాక్‌ రాజ్యాంగ విరుద్ధమని, ఈ పద్ధతి చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది

అయితే ఈ ముమ్మారు తలాక్‌పై 1982లో ‘నిఖా’ అనే చిత్రం వచ్చింది. బీఆర్‌.చోప్రా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో రాజ్‌ బబ్బర్‌, సల్మా అఘా, దీపక్‌ పరషర్‌లు నటించారు. కాగా.. ఈ చిత్రానికి మొదట ‘ తలాక్.. తలాక్.. తలాక్’ అనే పేరు పెట్టాలని భావించారట. అయితే.. ఈ సినిమా పేరు విషయంలో  బీఆర్ చోప్రా ముస్లిం మిత్రుడు అభ్యంతరం వ్యక్తం చేశాడట. ‘చోప్రా గారు..  ఈ సినిమా పేరుతో నాకో సమస్య ఉంది. నేను ఇంటికి వెళ్లి.. నా భార్యతో సినిమాకు వెళదామని అడగలేను. సినిమా పేరు కనుక నేను చెబితే..  విడాకులు ఇస్తున్నానేమో అనకొని నా భార్య గుండె పగిలిపోతుంది ’ ఆయన చోప్రాతో చెప్పారట. దీంతో ఆయన బాగా ఆలోచించి.. సినిమా పేరుని ‘నిఖా’ గా మార్చేశారు.

 

 

 ఈ నిఖా సినిమాలో సల్మాతో గొడవ పెట్టుకున్న భర్త దీపక్‌ ముమ్మారు తలాక్‌ ఇచ్చి ఆమెను వదిలించుకోవాలనుకుంటాడు. అప్పుడు ఆమె వేరే దిక్కు లేక అవమానాలు భరిస్తూ ఉద్యోగం చూసుకుని జీవించాలనుకుంటుంది. ఇంతలో సల్మాకు రాజ్‌ బబ్బర్‌తో పరిచయమవుతుంది. అలా ఇద్దరూ ప్రేమించుకుంటారు.విషయం తెలిసి మళ్లీ దీపక్‌.. సల్మాను తన జీవితంలోకి తిరిగిరావాలని అంటాడు. అప్పుడు రాజ్‌ బబ్బర్‌.. సల్మాకి ముమ్మారు తలాక్‌ ఇస్తాడు.దాంతో ఇద్దరినీ భరించలేక సల్మా నరకం అనుభవిస్తుంది.

అలా ముమ్మారు తలాక్‌ విధానంతో ఓ ముస్లిం మహిళ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొందో ఈ చిత్రంలో చూపించారు బీఆర్‌.చోప్రా. అంతేకాదు ఈ సినిమాకి సెన్సార్‌ బోర్డు కూడా పూర్తిగా సహకరించింది. ఈ చిత్రానికి రెండు ఫిలింఫేర్‌ అవార్డులు కూడా వరించాయి. ఈ ముమ్మారు తలాక్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు  తాజాగా ‘హలాల్‌’ అనే మరాఠీ సినిమా కూడా రాబోతోంది.

click me!