ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

First Published Nov 15, 2017, 12:21 PM IST
Highlights
  • కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు
  • అసెంబ్లీ వద్ద ఆందోళన చేస్తున్న ఉద్యోగులు
  • అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం

ఏపీ అసెంబ్లీ వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతండగా.. మరోవైపు ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు.  తమ పెన్షన్ సమస్యను పరిష్కారం కోసం అసెంబ్లీని ముట్టడించాలని ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ పిలుపు మేరకు ఉద్యోగులు  కాంట్రిబ్యూటరీ ఫెన్షన్ స్కీం( సీపీఎస్) ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు.

 అసెంబ్లీని ముట్టడించేందుకు ఉద్యోగులు రంగం సిద్ధం చేసుకున్నారు. అసెంబ్లీ ముట్టడికి ప్రభుత్వ ఉద్యోగులంతా ముందుకు రాగా.. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇప్పటికే పలువురు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగులను పోలీసులు ఎత్తి వాహనాల్లో పడేస్తున్నారు. పోలీసుల రక్షణ వలయాన్ని తోసుకుంటూ ఉద్యోగులు ముందుకు వెళ్లడానికి ప్రయత్నించడంతో.. ఆ ప్రాంతమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్వల్ప లాఠీ ఛార్జ్ కూడా చోటుచేసుకుంది.

అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా.. ఉద్యోగుల అరెస్టులపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతున్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ ఉద్యోగులను అరెస్టు చేయడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అసెంబ్లీని ముట్టడించి తీరుతామని ఉద్యోగులు పేర్కొన్నారు.

 

 

 

click me!