పది పాస్ అయితే.. పోస్టల్ ఉద్యోగం

First Published Apr 5, 2018, 10:00 AM IST
Highlights
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు శుభవార్త. ప్రారంభ జీతం రూ.25వేలు

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు నిజంగా ఇది శుభవార్త. కేలవం పదో తరగతి పాస్ అయ్యి ఉంటే చాలు.. ప్రభుత్వ ఉద్యోగం అందులోనూ.. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఈజీగా సంపాదించవచ్చు.పోస్టల్  శాఖ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.రాత పరీక్షలో ప్రతిభ కనపరిస్తే చాలు.. చాలా సులభంగా ఉద్యోగాన్ని సంపాదించవచ్చు. కొత్తగా అమల్లోకి వచ్చిన వేతన నిబంధనల ప్రకారం పోస్టుమెన్‌, మెయిల్‌ గార్డు ఉద్యోగాలకు రూ. 21,700 మూలవేతనం లభిస్తుంది. దీనికి అదనంగా కరవుభత్యం, ఇంటిఅద్దె భత్యం... మొదలైనవన్నీ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి. కాబట్టి ఎలాంటి చిన్న గ్రామంలో పోస్టింగ్‌ వచ్చినప్పటికీ ప్రతి నెలా పాతికవేల రూపాయల వేతనం కచ్చితంగా పొందగలరు. అన్నింటికంటే ముఖ్యంగా ఒత్తిడి, పనివేళలు తక్కువగా ఉంటాయి. కొద్దిపాటి అనుభవంతో శాఖాపరమైన పరీక్షల ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయికీ చేరుకోవచ్చు. ఖాళీలను రాతపరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా భర్తీచేస్తారు. ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి.

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే.. వారి వయసు ఏప్రిల్ 21,2018 నాటికి 18 ఏళ్లు నిండి.. 27 ఏళ్లలలోపు వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. పూర్తి వివరాల కోసం..www.telanganapostalcircle.in/ www.indiapost.gov.in కి లాగిన్ అవ్వండి.

click me!