నిరుద్యోగులకు శుభవార్త.. టెన్త్ క్వాలిఫికేషన్ తో రైల్వే జాబ్

First Published Feb 9, 2018, 12:38 PM IST
Highlights
  • దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్ల పరిధిలో ఖాళీగా ఉన్న 62,907 గ్రూప్‌-డి పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుద‌ల చేసింది.

నిరుద్యోగులకు ఇండియన్ రైల్వే శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్ల పరిధిలో ఖాళీగా ఉన్న 62,907 గ్రూప్‌-డి పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. పదోతరగతి, ఐటీఐ క్వాలిఫికేషన్ తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించవచ్చు. గ్రూప్‌-డి ప‌రిధిలో... ట్రాక్‌మ్యాన్‌, గేట్‌మ్యాన్‌, పాయింట్స్‌ మ్యాన్‌, హెల్ప‌ర్‌, పోర్ట‌ర్ లాంటి పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల వయసు 01.07.2018 నాటికి 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్ల వరకు వయసు పొడిగింపు ఉంది.  ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. కంప్యూట‌ర్ ఆధారిత రాతప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. పరీక్ష ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు, ఈబీసీలు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. ఎంపికైనవారికి నెలకు రూ.18,000 వేతనంతోపాటు ఇతర అలవెన్సులు ఉంటాయి. ఆన్ లైన్ ధరఖాస్తు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మార్చి 12వ తేదీ చివరి దరఖాస్తు తేదీగా ప్రకటించారు.
 

click me!