
బాబాలు ఇండియాలో బాగా ఫేమస్. సాధారణంగా బాబాలు చాలా నిడారంబరంగా ఉంటారు. కానీ ఈ బాబా మాత్రం అందుకు విరుద్ద. గోల్డెన్ బాబా పేరు ఎప్పుడైనా విన్నారా... అదేంటి పేరు విచిత్రంగా ఉందని అనుకుంటున్నారా. అవును పేరు మాత్రమే కాదు, ఆయన గురించి తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆయన తన శరీరం మీద కేవలం 14.5 కిలోల బంగారం ధరిస్తారు.
గతంలో 12 కిలోల బంగారం ధరించేవారు. ఈ యెడాది మరో 2.5 కిలోల బంగారు ఆభరణం చేయించుకున్నారు. అంటే ఇప్పుడు ఆయన పూర్తిగా 14.5 కిలోల బంగారం ధరిస్తున్నారు. అసల అంత బరువు ఎలా మోస్తారు అని సందేహాం కల్గింది కదా..! ఆ బంగారాన్ని ఆభరణాల రూపంలో ధరిస్తారు. ఒక్కొక్కటి 2 కిలోల బరువు ఉంటాయి. మరో నాలుగు కిలోల వరకు బంగారాన్ని చేతులకు ధరిస్తారు. ఆ స్థాయిలో బంగారం ధరిస్తున్నారు కాబట్టే ఆయనను గోల్డెన్ బాబా అంటున్నారు. ఒక్క బంగారమే కాదండోయ్ ఇంకా చాలా ఉంది. గోల్డెన్ బాబాకు ఒక బిఎండబ్ల్యూ కారు, రెండు ఆడి కార్లు, మూడు పార్చునర్ కార్లు ఉన్నాయి.
బంగారం, కార్లు మాత్రమే అనుకుంటే మళ్లీ పొరపాటే. ఆయన 27 లక్షల రోలెక్స్ వాచ్ ని ధరిస్తారు. ఆయన ఎక్కడికి వెళ్లినా ఎప్పుడు 16 కార్లతో ప్రయాణిస్తారు. అతడి చుట్టు 16 మంది బౌన్సర్లు, 10 మంది పోలీసులు ఉంటారు.
అస్సలు ఎవరు ఈ గోల్డెన్ బాబా అనే సందేహాం కల్గుతుంది కదా..! ఆయన ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన వారు. ఆయన అక్కడ ప్రతి సంవత్సరం కన్వర్ యాత్రలో పాల్గొంటారు. చివరి సారి ఆయన కుంభమేళలో పాల్గొన్నప్పుడు గోల్డెన్ బాబా ఆభరణాలను ఇద్దరు విదేశీ యువతులు మోసుకేళ్లారు. అప్పుడు అదోక విచిత్ర వార్తగా ప్రచారం అయింది.