14 నెలల గరిష్ఠానికి పసిడి ధర

First Published Feb 7, 2018, 11:56 AM IST
Highlights
  •  ఒకవైపు ప్రపంచ ప్రధాన మార్కెట్లు భారీ నష్టాలు చూస్తుండగా... బంగారం ధర ఆకాశానికి ఎగిసింది.

బంగారానికి డిమాండ్ బాగా పెరిగింది. ఒకవైపు ప్రపంచ ప్రధాన మార్కెట్లు భారీ నష్టాలు చూస్తుండగా... బంగారం ధర ఆకాశానికి ఎగిసింది. 14 నెలల గరిష్ఠానికి పసిడి ధర చేరుకుంది. బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.330 పెరిగి.. రూ.31,600కి చేరింది. మార్కెట్ల ప్రభావంతోపాటు.. స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో.. బంగారం ధర పెరిగినట్లు బులియన్ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా.. మరికొద్ది రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ మొదలౌతుండటంతో.. పసిడి కి రెక్కలు వచ్చినట్లు వారు పేర్కొన్నారు. వెండి ధర కూడా భారీగానే పెరిగింది. రూ.500 పెరిగి కేజీ వెండి ధర రూ.40వేలకు చేరింది.  అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర పెరిగింది. సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.27శాతం పెరిగి 1,342.60 డాలర్లుగా  ఉండగా, వెండి ధర 0.84శాతం పెరిగి ఔన్సు వెండి ధర 16.85డాలర్లుగా ఉంది.

click me!