బంగారం, వెండి పోటీపడి...

First Published Feb 7, 2017, 2:08 PM IST
Highlights

రెండు రోజుల నుంచి పోటీపడి పెరుగుతున్న ధరలు

బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. గత రెండు రోజుల నుంచి పోటీ పడి రెండింటి ధరలు పెరుగుతూ వస్తున్నాయి.

 

వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ నుంచి సానుకూల ప్రభావం ఉండటంతో ధరలు అమాంతం పెరిగినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

 

ఈ రోజు బులియన్ మార్కెట్ లో పసిడి ధర 10 గ్రాములకు రూ. 200 పెరిగింది. ధర రూ.29,850 గా నమోదైంది. అలాగే,  కేజీ వెండి ధర రూ.350 పెరిగి రూ.42,800 కి చేరుకుంది.

 

కాగా, అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

click me!