గోవా జల్సా రాయుళ్లకు దుర్వార్త

First Published Sep 18, 2017, 1:33 PM IST
Highlights

బహిరంగ ప్రదేశాల్లో మద్యపానాన్ని నిషేధించారు

గోవా అంటే బీచ్, కెసినో...ఫెనీ  ఈమూడు లేకపోతే, గోవా అర్థమే మారిపోతుంది. గోవాకు చాలా మంది వెళ్లేది కూడా బీచ్ లు చూడ్డానికి, నాలుగు గుక్కలు ముందేసేకొవడానికే. అంతేకాదు, గోవాలో ఎక్కడబడితే కూర్చుని దర్జాగా బాటిల్ వోపెన్ చేయవచ్చు. గోవా కల్చర్ చాలా లిబరల్ గా ఉండేది. అందుకే శెలవులొస్తే చాలా మంది గోవాకు దూసుకెళ్తుంటారు. గోవా ఎపుడూ చూల్లేదా... అయితే, మీరొక సారి ఫ్రాంక్ సైమోస్ రాసిన Goa అనే పుస్తకం చదవండి. గోవాకెళ్లాలనిపిస్తుంది. బోచ్ లోనో, బార్ లోనో, హోటల్ గదిలోనో కూర్చుని ఫెనీ  సిఫ్ చేస్తూ ఒక రోజంతా గడపాలని పించకపోతే, అడగండి.  అయితే, ఇపుడు గోవాను అదుపుచేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. గోవాలో ఇకపై ఎక్కడ బడితే అక్కడ మద్యం సేవించే స్వేచ్చ ఇక ముందు ఉండదు. మందుబాబులను నిరుత్సాహ పరుస్తూ బహిరంగ ప్రదేశాలలో తాగడం కుదరదని  రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఉత్తర్వులు జారీ చేశారు.

గోవా నిండా బార్ లే, పబ్ లు, మద్యం దుకాణాలే ఉంటాయి. ఇవే గోవాకు రంగులద్దింది. ఈ నిర్ణయం గోవా  సందర్శకులకు నిరుత్సాహ పర్చడమే కాదు, మద్య వ్యాపారాన్ని కూడా దెబ్బతీయనుందని చెబుతున్నారు. ఇక ముందు గోవాలో మద్యం తాగాలంటే లోపలెక్కడో  నాలుగు గోడల మధ్యే నక్కి కూర్చోవాలి.  బహిరంగ స్థలాల్లో ఇక ముందు  మద్య పానం వీలు కాదని సీఎం మనోహర్ పారికర్ స్పష్టం చేశారు.ఎవరైనా రోడ్ల మీద  మద్యం తాగితే జరిమానాలు విధిస్తామని, మద్యం షాపుల లైసెన్సులను రద్దు చేస్తామని సీఎం ప్రకటించారు.రోడ్లపక్కన కూర్చొని మద్యం తాగి,  బాటిళ్లను పగలగొట్టి కొంత మంది అభద్రతా భావం సృష్టిస్తున్నందున నిషేధం విధించాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి చెబుతున్నారు.  గత ఏడాది  నుంచి బీచ్ కొన్ని చోట్ల ‘నో ఆల్కాహాల్ జోన్’ లను కూడా ప్రకటించారు.

 

 

click me!