వాట్సాప్ లో నీలిచిత్రం రావడంలో నా ప్రమేయం లేదు

First Published Aug 16, 2017, 4:12 PM IST
Highlights
  • నా ఫోన్ నుంచి పోస్టు కావడంతో అప్పుడే క్షమాపణలు చెప్పానన్నారు
  • కావాలనే కొందరు తనను ఇందులో ఇరికించారని ఆయన ఆరోపించారు.

 

జీహెచ్ఎంసీ కార్పొరేటర్ అధికారి మీడియా సాక్షిగా మహిళా కార్పొరేటర్లకు  క్షమాపణలు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం జీహెచ్ఎంసీ కారొపరేటర్ల వాట్సాప్ గ్రూప్ లో నీలిచిత్రం పోస్ట్ అయ్యింది. అది వెంగళరావు నగర్ కార్పొరేటర్  కిలారి మనోహర్ ఫోన్ నుంచి పోస్టు అయ్యింది. ఈ విషయం కాస్తా.. మీడియాకి తెలియడంతో.. వివాదాస్పదంగా మారింది. దీనిపై మనోహర్ వివరణ ఇచ్చారు.

తన ప్రమేయం లేకుండా ఇది జరిగిందని ఆయన తెలిపారు. నా ఫోన్ నుంచి పోస్టు కావడంతో అప్పుడే క్షమాపణలు చెప్పానన్నారు. 10 రోజుల తర్వాత  ఈ విషయం బయటకు వచ్చిందని.. కావాలనే కొందరు తనను ఇందులో ఇరికించారని ఆయన ఆరోపించారు.

నైతిక బాధ్యతగా మహిళా కార్పొరేటర్లకు బహిరంగ క్షమాపణలు చెబుతున్నట్లు ఆయన వివరించారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే కొంత మంది రాద్దాంతం చేస్తున్నారన్నారు.గత నెల 31న కాఫీ విత్ కార్పొరేటర్ లో భాగంగా తన ఫోనును కారు డ్రైవర్ కి ఇచ్చినట్లు చెప్పారు. అతని వద్ద నుంచి పార్టీ కార్యకర్త రవి ఫోన్ తీసుకొని  నీలి చిత్రాలు డౌన్ లోడ్ చేశాడని.. అది పొరపాటున వాట్సాప్ గ్రూప్ లో పోస్టు అయ్యిందని తెలిపారు. కొద్ది సేపటికే ఓ కార్పొరేటర్  ఫోన్ చేయగా.. డ్రైవర్ ఫోన్ తీసుకువచ్చి ఇచ్చాడని.. అతను చెప్పేదాక తనకు ఆ విషయం తెలియదని చెప్పారు. వెంటనే ఆ ఫోటో డిలీట్ చేసి క్షమాపణలు చెప్పానని ఆయన వివరించారు.

click me!