
బంతి తగిలి పాక్ క్రికెట్ క్రీడాకారొడొకరు మృతి చెందారు.పాకిస్థాన్‌కు చెందిన జుబేర్ అహ్మద్ అనే బ్యాట్స్ మన్ మర్దాన్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా బౌలర్ విసిరిన బౌన్సర్ అతని తలను బలంగా తాకింది తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత ఆయన మరణించాడు. ఈ నెల 14న ఈ ఘటన జరిగింది. అతను క్వెట్టా బేర్స్ టీమ్ తరఫున నాలుగు లిస్ట్ ఎ, టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ విషాద వార్తను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఆడేటపుడు రక్షణకోస కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని క్రికెటర్లకు హెచ్చరించారు. గతంలో షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ బంతి బలంగా తగలడంతో మృతి చెందిన విషయం తెలిసిందే.