ట్విట్టర్ లో జీహెచ్ఎంసీ సూపర్ హిట్

Published : Aug 16, 2017, 02:55 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
ట్విట్టర్ లో జీహెచ్ఎంసీ సూపర్ హిట్

సారాంశం

ట్విట్టర్లో మొదటి స్థానం ఫేస్ బుక్ లో రెండో స్థానం

 

జీహెచ్ఎంసీ( గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్)కి సోషల్ మీడియాలో ఆదరణ పెరుగుతోంది. దేశంలోని ఇతర కార్పొరేషన్లతో పోలిస్తే.. జీహెచ్ఎంసీనే ముందంజలో ఉంది. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్’ బిజినెస్ లో భాగంగా సోషల్ మీడియాలో అడుగుపెట్టిన జీహెచ్ఎంసీకి ఫాలోయింగ్ నానాటికీ పెరిగిపోతోంది. ట్విట్టర్ 20 వేలమంది ఫాలోవర్లు ఉండగా.. ఫేస్ బుక్ లో 38,934 మంది ఫాలోఅవుతున్నారు. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ ఓ ప్రకటనలో తెలియజేసింది. ట్విట్టర్  లో మొదటి స్థానంలో ఉండగా.. ఫేస్ బుక్ లో రెండో స్థానంలో ఉంది.

బెంగళూరు కార్పొరేషన్ ను ట్విట్టర్ లో 10,055, పూణె కార్పొరేషన్ ను 6502, సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ను1812, భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ను 1274, విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ను 793, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ను 448మంది ఫాలో అవుతున్నారు.

ఫేస్ బుక్ లో  45,402 ఫాలోవర్లతో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో జీహెచ్ఎంసీ నిలిచింది. ఆ తర్వాతిత స్థానాల్లో న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, విశాఖ కార్పొరేషన్లు ఉన్నాయి.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !