తీహార్ జైలు నుంచి పరీక్ష పాసయిన మాజీ ముఖ్యమంత్రి

First Published May 18, 2017, 12:03 PM IST
Highlights

జైలు శిక్ష అనుభవిస్తున్న 82 సంవత్సరాల పెద్ద మనిషొకాయన నిజంగా ఒక ఘన కార్యం చేశాడు.
జైలు ఏం చేయాలో పాలుపోక, ఇంటర్మీడియట్ పరీక్ష కట్టి పాసయ్యాడు. ఈ పెద్దాయన ఎవరో కాదు, దేశానికి కంతటికి బాగా పరిచయమయిన పేరు... హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐ ఎన్ ఎల్ డి) పార్టీ అధ్యక్షుడు .

జైలు శిక్ష అనుభవిస్తున్న 82 సంవత్సరాల పెద్ద మనిషొకాయన నిజంగా ఒక ఘన కార్యం చేశాడు.


జైలు ఏం చేయాలో పాలుపోక, ఇంటర్మీడియట్ పరీక్ష కట్టి పాసయ్యాడు.


ఏ పెద్దాయన ఎవరో కాదు, దేశానికి కంతటికి బాగా పరిచయమయిన పేరు... హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐ ఎన్ ఎల్ డి) పార్టీ అధ్యక్షుడు .


చిన్నపుడు ఏమొచ్చిందో ఏమో టెన్త్ మించి చదవలేదు.  తర్వాత పెద్దవాడయ్యాడు, రాజకీయాల్లోకి వచ్చాడు. ఇంకా పెద్దవాడయిన ముఖ్యమంత్రి కూడా అయ్యాడు.


అంతేకాదు,  ఒక కుంభకోణంలో చిక్కుకుని పదేళ్ల జైలు శిక్ష ఢిల్లీలోని తీహార్ జైలు లోఅనుభివిస్తున్నారు.


ఆయన జైలు కు వెళ్లింది కూడా చదువుకు సంబంధించి వ్యవహారంలోనే.  రాష్ట్రంలో 16 సంవత్సరాల కిందట 3206  బేసిక్ టీచర్ల నియమాకంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణ. ఈ కుంభకోణంలో కుమార్ అజయ్ సింగ్ చౌతాలాతో పాటు ఆయనకు కోర్టు 2013 జనవరి 16న పదేళ్ల జైలు శిక్ష విధించింది.


జైలులో ఖాళీగా కూర్చోకుండా,  ఆయన ప్లస్ టు పరీక్ష కట్టారునేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్‌లో ప్లస్ టు పరీక్ష రాసి  పాస్ అయ్యారు.దీనితో ఆయన దేశంలో అవినీతి శిక్షపడిన తొలి మాజీ సిఎం కావడమేకాదు, జైలునుంచి పరీక్ష కట్టి, బుద్ధిగా చదువుకుని పాసయిన మాజీ ముఖ్యమంత్రికూడా ఆయనే అయ్యారు.
 

click me!