వన్నా క్రై బారిన తిరుమలేషుడు

Published : May 17, 2017, 05:18 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
వన్నా క్రై బారిన తిరుమలేషుడు

సారాంశం

హ్యాక్ అయిన తెలుగు రాష్ట్రాల సచివాలయ కంప్యూటర్లు

ప్రపంచాన్ని వణికిస్తున్న వన్నా క్రై ఎఫెక్టు తెలుగు రాష్ట్రాల సచివాలయాలపైనా పడింది. అంతేకాదు తిరుమల తిరుపతి దేవస్థానం కంప్యూటర్లకు ఈ వైరస్ సోకింది.

 

దీంతో రెండు రాష్ట్రాల ఐటీ అధికారులు అప్రమత్తమయ్యారు.

 

వన్నా క్రై బారిన పడకుండా ఉండేందుకు తెలంగాణ సచివాలయ కంప్యూటర్ల నుంచి నిన్ననే ఇంటర్ నెట్ కనెక్షన్ ను పూర్తిగా తొలగించారు.

 

అయితే కొన్ని కంప్యూటర్లు వన్నా క్రై బారిన పడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీ సచివాలయ కంప్యూటర్లు వన్నా క్రై ఎఫెక్టుకు గురైనట్లు రాష్ట్ర  ఐటీ శాఖ గుర్తిచింది. వెంటనే చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించింది.

 

ముఖ్యంగా అన్ని కంప్యూటర్లు, హార్డ్ డిస్కులను రీ రైట్ చేస్తున్నట్లు ఐటీ శాఖ తెలిపింది.

 

యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ ఇన్సటాల్ చేసేందుకు ఇప్పటికే ఐటీ  అధికారులు చర్యలు చేపట్టారు.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !