ఫ్లిప్ కార్ట్ ఫోన్ వచ్చేసింది..!

First Published Nov 15, 2017, 1:08 PM IST
Highlights
  • భారత మార్కెట్ లోకి ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ ఫోన్ అడుగుపెట్టింది
  • ఫ్లిప్ కార్ట్ సంస్థ.. స్వయంగా ఒక కొత్త మోడల్ ఫోన్ ని విడుదల చేసింది.

భారత మార్కెట్ లోకి ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ ఫోన్ అడుగుపెట్టింది.  ఇప్పటి వరకు ఫ్లిప్ కార్ట్ నుంచి కొనుగోలు చేసిన మొబైల్  ఫోన్లన్నీ.. ఇతర కంపెనీలకు సంబంధించినవన్న విషయం మన అందరికీ తెలిసిందే. అలాకాకుండా.. ఫ్లిప్ కార్ట్ సంస్థ.. స్వయంగా ఒక కొత్త మోడల్ ఫోన్ ని విడుదల చేసింది.

‘‘క్యాప్చర్ +’’  పేరుతో బుధవారం ఈ ఫోన్ ని విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ కామర్స్‌ పోర్టల్‌గా ఉన్న ఫ్లిప్‌కార్ట్‌ బిలియన్‌ బ్రాండ్‌తో ఈ ఫోన్ ని విడుదల చేసింది. ఈ క్యాప్చర్ +  స్మార్ట్ ఫోన్ కి డ్యూయల్ కెమేరా సదుపాయం ఉంది. ఈ కెమేరాలకు నైట్ మోడ్  ఎఫెక్ట్, ఫోటోగ్రఫీ ఎఫెక్ట్ ‘బొకే’( ఇదో రకం ఫోటోగ్రపీ ఎఫెక్ట్) ని కూడా ఏర్పాటు చేశారు. చాలా తక్కువ సమయంలో బ్యాటరీ ఛార్జ్ అవ్వడం  ఈ ఫోన్ మరో ప్రత్యేకత.  ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ నగ్గెట్. ఫుల్ హెచ్ డీ డిస్ప్లే సదుపాయం ఉంది.

రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ విడుదలైంది. 3జీబీ ర్యామ్‌, 32జీబీ ఇంటర్నల్ మెమరీ ఫోన్‌ ధర రూ.10,999గా ఉండగా.. 4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్ మెమరీ మోడల్‌ ధర రూ.12,999గా కంపెనీ నిర్ణయించింది. స్మార్ట్‌ ఫోన్‌ లాంఛ్‌ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డుతో ఈ ఫోన్ ని కొనుగోలు చేసిన కస్టమర్లకు 10శాతం క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది.

 

క్యాప్చర్ + ఫోన్ ఫీచర్లు..
 5.5 ఇంచెస్ టచ్ స్క్రీన్ 
 ఆండ్రాయిడ్‌ 7.1.2 నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్  
 625 అక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ ప్రొసెసర్‌ 
 3జీబీ, 4జీబీ ర్యామ్‌ 
 13 మెగాపిక్సల్‌+ 13 మెగాపిక్సల్‌ వెనుక కెమెరాలు 
 8 మెగాపిక్సల్‌ ముందు కెమెరా 
 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

click me!