కడప దగ్గిర ఘోర ప్రమాదం: ఐదుగురు యాత్రికులు మృతి

Published : May 31, 2017, 03:37 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
కడప దగ్గిర ఘోర ప్రమాదం:  ఐదుగురు యాత్రికులు మృతి

సారాంశం

 తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనంచేసుకుని తిరిగివస్తున్నపుడు  వారి మిని బస్సు ప్రమాదానికి గురైంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రులను కర్నూలు జిల్లా చాగలమర్రి ఆస్పత్రికి తరలించారు.. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 15 మంది ఉన్నట్లు చెబుతున్నారు. డ్రైవర్‌ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కడప జిల్లా దువ్వూరు మండలం ఖానగూడూరు వద్ద బుధవారం ఉదయం జరగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తిరుపతి యాత్రికులు చనిపోయారు.

 

తిరుమల  శ్రీవారి దర్శనానికి వెళ్లి  తిరిగివస్తున్నపుడు వారి మిని బస్  ఖానగూడురు వద్ద డ్రైవర్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ఇసుక ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు.  మరో ఎనిమిది మంది తీవ్రగాయ పడ్డారు.  వీరంతా తెలంగాణా రంగారెడ్డి జిలా ఇబ్రహాం పట్నానికి చెందిన వారు.అంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.


వీరంతా తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనంచేసుకుని తిరిగివస్తున్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రులను కర్నూలు జిల్లా చాగలమర్రి ఆస్పత్రికి తరలించారు.. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 15 మంది ఉన్నట్లు చెబుతున్నారు. డ్రైవర్‌ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !