ఒకెే దేశం, ఒకెే పన్ను... ఒక పద్యం

Published : Jun 24, 2017, 11:03 AM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
ఒకెే దేశం, ఒకెే  పన్ను... ఒక పద్యం

సారాంశం

సుడిగాలి మాదిరి  దేశంమీదకు రాబోతున్న జిఎస్ టి మీద బాసిత్ పద్యం.   జిఎస్ టి అనేది నేిటి పాలక పక్షం బహుముఖ విధానంలో ఒక భాగంగా వస్తున్నదని బాసిత్ అంటున్నారు. చదవండి...

ఒకే పన్ను...
____

పళ్లు రాల గొట్టి
పన్నులు  రాబట్టుకుంటాం...

మొన్న 
ప్రణాళిక సంఘాన్ని
రద్దు చేశాం...

నిన్న 
పెద్దనోట్లు
రద్దు చేశాం...

ఇవ్వాళ 
చిల్లర వర్తకుల, 
కుటీర,లఘు పరిశ్రమల,
చిన్నా చితక వినియోగదారుల
నడ్డి విరిచే
'వస్తు సేవల పన్ను' ప్రకటించేశాం...

ఇప్పుడర్థమైందనుకుంట...
ప్రజల్ని పీల్చి పిప్పిచేయడమే
మా ప్రణాళిక...
ప్రజల్ని ఉద్ధరించే
ఉద్దేశమే లేనప్పుడు
ఇంకా ప్రణాళికా సంఘమెందుకు?

నోట్లో నాలుక లేనోళ్ల దగ్గర
కోట్లాది దొంగ నోట్లు ఉన్నాయన్నట్లు
బ్యాంకుల ముందు క్యూలు గట్టించి
బీదాబిక్కి దగ్గరున్న నోట్లన్ని 
లాక్కున్నాం..


పన్ను ఎగవేసి
లక్షల కోట్లతో పరారైన
బడాబాబుల జేబుల్ని
మరింత నింపడానికి
కొత్త నోట్లు ముద్రించి
వాళ్ల కొట్టాలకే
మళ్లీ  చేరవేశాం..

డిమానిటేషన్
దిక్కులేని జనాల్ని పీక్కు తినడానికే....

మేం
రెండు రకాలుగా
ప్రజలపై యుద్ధం చేయదలిచాం...

నడ్డి విరిచే ప్రణాళికలేసి...
నోట్లు పీక్కొని..
పన్నులేసి...
ఆర్థిక ఉగ్రవాదంతో
అందర్ని ఆగం ఆగం చేస్తాం...

కాశ్మీర్ ను
మధ్యభారతాన్ని
ఈశాన్య భారతాన్ని
ప్రజలపై ప్రత్యక్ష యుద్ధంతో
రక్తసిక్తం చేస్తాం...

ఒకే దేశం..ఒకే ప్రజ...ఒకే పన్ను...
దేశమంతా ఉన్మాదాన్ని రెచ్చగొడతాం....

వేలెత్తినారో!
ఉగ్రవాదమని, తీవ్రవాదమని
న(తె)ల్ల చట్టాలతో 
నట్లూడ గొడతాం...

ఇప్పుడర్థమైందా?
మా ఇజంలో
దాగిన నిజం... ఫాసిజం!

- బాసిత్

 

(‘ప్రజా  స్పందన వేదిక’ నుంచి పునర్ముద్రితం)

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !