200 మిలియన్ల యూజర్లు ఒంటరివారే: డేటింగ్ గేమ్ లోకి ఫేస్ బుక్

First Published May 2, 2018, 10:14 AM IST
Highlights

ఫేస్ బుక్ డేటింగ్ గేమ్ లోకి ప్రవేశించబోతోంది. ఫేస్ బుక్ ప్లాట్ ఫామ్ పై డేటింగ్ యాప్ ను లాంచ్ చేస్తామని ఆ సంస్థ సిఈవో మార్క్ జుకర్ బర్గ్ మంగళవారంనాడు ప్రకటించారు.

శాన్ జోన్: ఫేస్ బుక్ డేటింగ్ గేమ్ లోకి ప్రవేశించబోతోంది. ఫేస్ బుక్ ప్లాట్ ఫామ్ పై డేటింగ్ యాప్ ను లాంచ్ చేస్తామని ఆ సంస్థ సిఈవో మార్క్ జుకర్ బర్గ్ మంగళవారంనాడు ప్రకటించారు. ప్రపంచంలోని అతి పెద్ద సోషల్ నెట్ వర్క్ పై లక్షల మంది ప్రజలను కలిపేందుకు డేటింగ్ సేవలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. 

ఈ సేవలను త్వరలోనే ప్రారంభిస్తామని, దీంతో యువకులు తమ పాపులారిటీని పునర్నిర్మాణం చేసుకోవచ్చునని ఆయన చెప్పారు. దానివల్ల ఎక్కువ సార్లు తమ సైట్ ను సందర్శిస్తారని కూడా చెప్పారు. 

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ పై 200 మిలియన్లకు పైగా యూజర్లు ఒంటరివారేనని, దాంతో ఇక్కడ ఏదో ఒకటి చేయాలని నిర్ణయించామని జుకర్ బర్గ్ సాఫ్ట్ వేర్ డెవలపర్ల సమావేశంలో మంగళవారంనాడు అన్నారు. ప్రారంభం నుంచే ప్రైవసీని, సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని రూపొందించామని చెప్పారు. 

ఫేస్ బుక్ యూజర్లు తమ రిలేషన్ షిప్ స్టేటస్ ను వెల్లడించే ఫీచర్ ను 2004 ఫిబ్రవరిలో మొదట తీసుకుని వచ్చింది. ఈ డేటింగ్ సేవలతో ఫేస్ బుక్ పై ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు.  ఆ ప్రకటనతో ఫేస్ బుక్ షేర్లు 1.1 శాతం పెరిగాయి. 

click me!