02 మే 2018 బుధవారం మీ రాశిఫలాలు

Published : May 02, 2018, 09:49 AM IST
02 మే 2018 బుధవారం మీ రాశిఫలాలు

సారాంశం

అనుకోని లాభం కలుగుతుంది

మేషం

మేషం : ప్రతి పనిలో, రోజువారి జీవితంలో ఏదో ఒక ఇబ్బందిని, అడ్డంకులను ఎదుర్కొంటారు. గొడవలు, అవమానానికి గురవటం లేదా వివాదాల్లో ఇరుక్కోవటం జరుగవచ్చు. ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకోకండి. మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా పనులు చేస్తే విజయం వరిస్తుంది.

వృషభం

వృషభం :మీ మిత్రులను కలుసుకోవటం జరుగుతుంది. ప్రయాణంలో అనుకోని లాభం కలుగుతుంది. బంధువుల తో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ధన లాభం ఉంటది. పెట్టుబడులకు అను కూలం. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనకూల ఫలితం పొందుతారు. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

మిథునం

మిథునం : ఉద్యోగ విషయంలో కానీ, ప్రయాణం విషయంలో కానీ ఒక ముఖ్యవైన నిర్ణయం తీసుకుంటారు వ్యాపార సం బం ధ లావాదేవీ, ఒప్పందాలు జరుగుతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవటం కానీ మంచిది కాదు.

కర్కాటకం

కర్కాటకం :మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవటం లేదా అనుకోని అడ్డంకులు రావటం వలన మానసికం గా చికాకు కలతకు లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సవస్య కొంత తగ్గుతుంది. ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవద్దు .

సింహం

సింహం : ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉద ర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల ఆరో గ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషంలో జాగ్రత్త అవసరం.

కన్య

కన్య : మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణ యాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరుగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. బంధువులలో ఒకరి నంచి అను కోని సాయాన్ని పొందతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

తుల

తుల : ఈ రోజు ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాట తీరు కానీ, వ్యవహార శైలికానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంది. వివాదాల్లో తలదూర్చకండి, దాని కారణంగా ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటంది.

వృశ్చికం

వృశ్చికం : స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. జీవితభాగస్వామి అనుకోని బహుమతి ఇచ్చే అవకాశముంది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. ఎక్కవసేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలించవు.

ధనుస్సు

ధనుస్సు : ఆర్థికంగా సామాన్యంగా ఉంటది. అనుకోని ఖర్చులు కానీ ప్రయాణాలు కానీ చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బుకానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి.

మకరం

మకరం : ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అను కోని విధంగా డబ్బురావటం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి. పెట్టుబడులకు అనుకూలం కాదు.

కుంభం

కుంభం : ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయ త్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయ త్నాలు ఫలిస్తా యి. స్థిరాస్థి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూల దినం. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

మీనం

మీనం : ఈ రోజు మీరు దూరప్రదేశం నంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీ యానాని కి సంబంధించి ఒక ముఖ్యసమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేత్రదర్శనం చేసుకుంటారు. మంచి రుచికరమైన ఆహారం స్వీకరిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్ర త్త అవసరం.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu