బతుకమ్మ చీరెలు చింపేస్తారా... ఈటెల గుస్సా

First Published Sep 18, 2017, 11:47 PM IST
Highlights

అపోజిషనోళ్ల మీద ఆర్థిక మంత్రి మండిపడుతున్నారు

తెలంగాణలో ఈ రోజు బతుకమ్మ చీరెలు చించేయడం, కాల్చేయడం అడబిడ్దలుచేసిన పని కాదు, అపోజిషనోళ్ల పని ఆర్థిక మంత్రి నారాజయ్యుండు.

బతుకుమ్మ చీరెల పంపిణీ సందర్భంగా జరిగిన అవావంతరాలకు ఆయన ప్రతిపక్ష పార్టీలను నిందించారు.

 మీకు ఇష్టం లేకపోతే చీరలు తీసుకోవద్దు,  తీసుకొని ఇలాంటి పనులు చేయవద్దు  దయచేసి. తగలబెట్టి తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని  కించపరిచారు.
మీకు మా ఆడబిడ్డలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్కనా,’ అని ఆయన అన్నారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే....

ప్రభుత్వాలంటే బిల్డింగ్ లు కట్టడం , రోడ్ లు వేయడమే కాదు సంస్కృతి  సాంప్రదాయాలకు విలువ ఇచ్చేవి అని నిరూపించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం.ముస్లిం పేద యువతులకు షాది ముబారక్,హిందువులకు కల్యాణ లక్ష్మి, పెన్షన్ లు,గురుకులాలూ,సన్న బియ్యం, రేసిడెన్సియల్ స్కూల్స్, మూడు ఎకరాల భూమి,డబల్ బెడ్ రూమ్ ఇల్లు...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన పధకాలను దేశం లోనే మొదటి సరిగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది..పండుగలకు పెద్ద పీఠ వేస్తుంది. ఇప్పటికే రంజాన్, క్రిస్ మస్ లకు బట్టలపంపిణీ చేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ లో ఆతిపెద్ద పండుగ దాసరాకు మన ఆడ బిడ్డలకు చీరలు పెడుతున్నాం.
      చీరల పంపిణీని ప్రతిపక్ష నేతలు డబ్బుల కోణం లో చూస్తున్నారు. మేము ప్రేమ , ఆప్యాతలతో చూస్తున్నాం. ఆడబిడ్డకు పేద కుటుంబం 100 రూపాయల చీర పెట్టిన, డబ్బున్న కుటుంబం లక్ష రూపాయల చీర పెట్టిన అదే ప్రేమతో పెడతారు. మీలగా లెక్కలు వేసుకోరు. రాజకీయం చెయ్యరు.
       ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ చీరలు బాలెవని ఆందోళనలు జరిగాయి, కొన్ని చోట్ల వాటిని తగులపెట్టారు. ఇవ్వన్ని చేసింది ఆడబిడ్డలు కాదు, ప్రతిపక్ష పార్టీలు. చీర ఆడవారికి సెంటిమెంట్ వాటిని వారు తగులబెట్టరు. ఆ ఆలోచన కూడా చెయ్యరు. ప్రతిపక్షాల వారు మీకు ఇష్టం లేకపోతే చీరలు తీసుకోవద్దు, కానీ తీసుకొని ఇలాంటి పనులు చేయవద్దు. తగలబెట్టి తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని  కించపరిచారు.
మీకు మా ఆడబిడ్డలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్న.
వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి.

 కరీంనగర్ లో జరిగిన మీడియా సమావేశం లో  ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలివి.

click me!