తిరుపతికి భూకంపం ముప్పుందా?

First Published Sep 18, 2017, 8:25 PM IST
Highlights

రూర్కీ ఐఐటి శాస్త్రవేత్తల అధ్యయనం

తిరుపతి భూకంప ప్రమాద పరిసరాల్లో ఉందా?

ఐఐటీ  రూర్కీ పరిశోధకులు తిరుపతి కింద భూగర్భంలో , తమిళనాడులోని పాలార్, తరంగంబాడి ప్రాంతాలలో కింద కదులుతున్న టెక్టోనిక్ పలకాలను పరిశీలించి  భూకంపం ముప్పు అంచనా వేస్తున్నారు. మనకింతవరకు ఉత్తర భారతం మాత్రమే భూకంపాల ముప్పున్న ప్రాంతమని తెలుసు. అయితే, భూగర్భంలో కదులుతున్న ఈ భూ ఖండ పలకాలు మెల్లిగా కదులుతూ ఢీ కొంటే భూమి ప్రకంపిస్తుంది. దక్షిణ భారత భూగర్భంలో కూడా  భూఖండాలను సృష్టించే నెర్రెలు (ఫాల్ట్ లైన్స్) ఉన్నాయి. వీటి వల్ల ముప్పు ఉందని అనుమానం. పెద్ద ఎత్తున యాత్రికులు సందర్శించే తిరుపతి వంటి  పుణ్యక్షేత్రాలలో భూకంపం వస్తే నష్టం విపరీతంగా ఉంటుంది. పాలార్ , తరంగం బాడి వంటి చోట్ల  మొదలయ్యే భూకంప ప్రభావం తిరుపతి మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇది 200 కి.మీ దాకానష్టం కల్గిస్తుందని అంచనా.  సెంట్రల్ వాటర్ కమిషన్ కోసం  రూర్కీ ఐఐటి వారు భూకంపం వచ్చే ప్రదేశాలను గుర్తిస్తున్నారు. ఎందుకంటే, డ్యామ్ లను, విద్యత్కేంద్రాలను నిర్మించాలంటే ఈ సమాచారం అవసరం. దక్షిన భారతదేలో భూకంప ప్రమాదం ఉన్న ప్రదేశాల సమాచారోం  ఒక వెట్ సైట్ ను కేంద్రం  ప్రారంభించబోతున్నది.

 

 

click me!