78 ఏళ్ల త‌రువాత ఇంగ్లాండ్ ఆ రికార్డును మ‌ళ్లీ సాధించింది

First Published Aug 1, 2017, 2:54 PM IST
Highlights
  • చాలా సంవత్సరాల తరువాత ఇంగ్లాండ్ జట్టు ఆ ఫీట్ సాధించింది.
  • మోయిన్ అలీ మూడు వికెట్లు తీయ్యడం.
  • అద్భుతమైన ఫిలీంగ్ అన్నా మోయిన్ అలీ.

టెస్టులో హ్యాట్రిక్ వికెట్ల‌ను న‌మోదు చెయ్య‌డం సాధార‌ణ విష‌యం కాదు. అయినా ప్ర‌తి దేశంలో టెస్టులో హ్యాట్రిక్ వికెట్ల‌ను బౌల‌ర్లు త‌మ జాబితాలో న‌మోదు చేసుకున్నారు. కానీ ఇంగ్లాండు స్పిన్‌లో మాత్రం 78 సంవ‌త్స‌రాల క్రితం అంటే 1938 లో స్పిన్న‌ర్  టామ్ గొగార్డ్ మూడు బంతుల్లో మూడు వికేట్లు తీశాడు. ఇక త‌రువాత ఏ ఇంగ్లాండ్ స్పిన్న‌ర్‌ టెస్టుల్లో ఈ పిట్‌ను ద‌క్కించుకొలేదు.
 
కానీ ఓవల్ మైదానంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ జట్టుకు ఆ క‌ల ఫ‌లిచింది. 239 పరుగుల తేడాతో ద‌క్షిణాఫ్రికా పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మోయిన్ అలీ చివరి మూడు వికెట్లనూ వరుస బంతుల్లో పడగొట్టి హ్యాట్రిక్ చేశాడు. అంతే 78 సంవ‌త్స‌రాల చ‌రిత్ర తిరిగి పున‌రావృతం అయింది. మ‌రో ప‌క్క టెస్టులో విజ‌యం సాధించ‌డంతో ఆ జ‌ట్టు సంబంరాల్లో మునిగిపోయింది.

మ్యాచ్ అనంత‌రం మోయిన్ అలీ మాట్లాడుతు త‌న‌కి చాలా ఆనందంగా ఉందని పెర్కొన్నారు. చివ‌రి మూడు బంతుల్లో హ్యాట్రిక్ సాధించ‌డం జీవితంలో మ‌రిచిపోలేని రోజ‌ని ఆయ‌న తెలిపారు. 
 

click me!