
షాహిద్ కపూర్ చాలా కాలం తరువాత ఉడ్తా పంజాబ్ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. ఆ సినిమాలో తన నటనకి ఇప్పటికే చాలా అవార్డులు వచ్చాయి. ఇప్పుడు ఐఫా బెస్ట్ యాక్టర్ అవార్డ్ కూడా వరించింది. అందులో షాహిద్ తన మనసులో మాట పంచుకున్నాడు.
ప్రస్తుతం షాహిద్ బంసాలీ డైరెక్షన్ లో పద్మావతీ సినిమాలో నటిస్తున్నారు. అందులో లీడ్ రోల్ లో దీపికా పదుకొనే నటిస్తున్న విషయం తెలిసిందే, అయితే షాహిద్ రవల్ రతన్ సింగ్ గా నటిస్తున్నాడు, అల్లావుద్దిన్ కిల్జీగా రణ్‌వీర్ సింగ్ నటిస్తున్నారు. నేను ఈ సినిమాలో పార్ట్ అవ్వడం నిజంగా చాలా లక్కిగా ఫీలవుతున్నా, ఇంత వరకు ఆయన డైరెక్ట్ చేసిన బాజీరావ్ మస్తానీ సినిమా చూశానని అందులో బంసాలీ టెకింగ్ సూపర్బ్ అని తెలిపారు. ఆ సినిమా చూసిన తరువాత నాకు పిచ్చెక్కి పోయిందని అన్నారు. ఆ టీం ను పోగడకుండా ఉండలేకపోయ్యానని తెలిపారు.
పద్మావతికి సినిమా పై వస్తున్న రూమర్లను ఆయన ఖండించారు. పద్మావతికి, అల్లావుద్దీన్ కిల్జీకి మద్య రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని, గతంలో పెద్ద గోవడనే జరిగగింది. అయితే ఆ గొవడకి పుల్ స్టాప్ పెట్టాడానికి షాహిద్ ప్రయత్నించారు. నాకు తెలిసి కిల్జీకి పద్మావతి కి మద్య అలాంటి సీన్స్ లేవని, ఇప్పటి వరకు అయితే అలాంటి చిత్రీకరణ జరగలేదని, త్వరలో మీ ముందుకి సినిమా వస్తుంది, మీకు అప్పుడు అర్ధమవుతుందని ఆయన తెలిపారు.