Yahoo! పేరు మారిపోతున్నది

First Published Jan 10, 2017, 11:29 AM IST
Highlights

యాహూ మాయమై ‘అల్టాబా’గా పుట్టబోతున్నది

తొలితరం ఇంటర్నెట్ వెబ్ పోర్టల్ యాహూ చరిత్ర ముగిసింది. 

 

ఈ కంపెనీని అమెరికన్ కమ్యూనికేషన్స్ సంస్థ వైరైజన్ గత జూలై లోనే  4.8 బిలియన్ డాలర్లకు కొనేసింది.  అయితే, ఇపుడు యాహూ పేరును అల్టాబా గా మార్చబోతున్నారు. యాహూ డైరెక్టర్లందరు ఇక పదవులనుంచి తప్పుకుంటారు. దీనితో యాహూ చరిత్ర పుటల్లోకి వెళ్లిపోతుంది.

 

1994లో జెనీయాంగ్, డేవిడ్ ఫిలో లు  యాహూను స్థాపించారు.  1995 మార్చిలో ఇన్ కార్పరేట్ అయింది. సర్చ్ ఇంజిన్ Yahoo!  వెబ్ పోర్టల్ గా ఒకపుడు ఒక వెలుగు వెలిగిన కంపెని ఇది.   Yahoo! Directory, Yahoo! Mail, Yahoo! News, Yahoo! Finance, Yahoo! Groups, Yahoo! Answers, ఇలా ఎంతో విస్తరించినా, వేగంగా మారిన పరిస్థితులలో యాహూ బతుకుదెరువు సాగడం కష్టమయింది. చివరకు 2016 జూలై లో కంపెనీని అమ్మకానికి పెట్టాల్సి వచ్చింది.

 

తొందర్లో ‘అల్టాబా ఇన్ కార్పొరేటె డ్’ గా కంపెనీ రిజస్ట్రేషన్ పూర్తవడంతో యాహూ చరిత్ర ముగుస్తుంది.

 

అల్టాబా అంటే ఏమిటో తెలుసా...

 

అల్టర్నేట్ ఆలీబాబా అని. ఆలీబాబా అనే చైనా కంపెనీ పేరు ఎందుకు వాడుకున్నారంటే... ఈ కంపెనీలో యాహూకు పెద్ద ఎత్తున స్టేక్ ఉంది. ఆలీబాబా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్లకు అల్టాబా ప్రత్యామ్నాయంగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

 

 యాహూ కంపెనీలన్నీ ఇక వైరైజన్ లో భాగమవుతాయి. ఇపుడు Tumblr, Flickr, Yahoo Sports and Yahoo News లు యాహూలో అదుపులో వుండేవి.

click me!