అతిపెద్ద విదేశీమద్యం షాపు

Published : Jan 10, 2017, 11:00 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
అతిపెద్ద విదేశీమద్యం షాపు

సారాంశం

దేశంలోనే అత్యంత పెద్దదైన విదేశీ మద్యం దుకాణాన్ని తెరిచారు.

ప్రత్యేక తెలంగాణా సాధించిన తర్వాత మిగితా రంగాల అభివృద్ధి విషయం ఎలావున్నా మద్యం రంగానికి మాత్రం ప్రభుత్వం విశేషంగా మద్దతు ఇస్తోంది. తాజాగా జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 36లో ప్రారంభమైన ఓ లిక్కర్ షాపును చూస్తే ఎవరైనా నిజమేనని ఒప్పుకోవాల్సిందే.

 

అధికారపార్టీకి సన్నిహితంగా వుండే ఓ బడాబాబు దేశంలోనే అత్యంత పెద్దదైన మద్యం దుకాణాన్ని తెరిచారు. అదీ అలాంటి ఇలాంటి షాపు కాదు. కొన్ని వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపును ప్రారంభించారు. ఇందులో కేవలం విదేశీమద్యం మాత్రమే లభిస్తుంది. కొన్ని వందల రకాల వైన్, స్కాచ్ వెరైటీలు లభ్యమవుతాయి.

 

 

దాంతో విదేశీమద్యం పుచ్చుకోవాలనే కోరిక వున్న ప్రియులంతా పొలోమంటూ షాపులోకి పరుగులు పెడుతున్నారు. ఎందుకంటే, ఇప్పటి వరకూ హైదరాబాద్ వాసులెవరైనా విదేశీమద్యం పుచ్చుకోవాలంటే కొంచెం ఇబ్బందే.

 

ఎందుకంటే, బయట షాపుల్లో విదేశీమద్యం అమ్మే షాపులు పెద్దగా లేవు. అందుకనే ఈ కొత్త షాపువైపు మద్యపాన ప్రియులు బారులు తీరుతున్నారు. నగరంలోని అత్యంత సంపన్నులు, ఐటి కార్యాలయాలు, అతిపెద్ద వాణిజ్య సముదాయాలుండే ప్రాంతమైన జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 36లో దేశంలోనే అతిపెద్ద విదేశీమద్యం దొరికే అతిపెద్ద షాపు తెరవటమంటే మాటలు కాదు కదా?

 

ఇప్పటి వరకూ నగరంలో స్పెన్సర్స్, మెట్రో డిపార్టమెంటల్ షాపుల్లో మాత్రమే అందుబాటులో ఉంది. అది కూడా చాలా తక్కువ బ్రాండ్లు మాత్రమే. ఇటీవలే విదేశీ మద్యాన్ని మాత్రమే అమ్మే 25 వైన్ షాపులను రాష్ట్రంలో అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

 

ఇందులో మొదటగా జూబ్లిహిల్స్ 36 రోడ్డులో మొదటిషాపు ఏర్పాటవ్వటం నిజంగా మద్యపాన ప్రియులను ఆలరించే విషయమే కదా? మరింకెందుకు ఆలస్యం మీరూ ఓ చూపు చూడండి.

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !