
ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన ఈ ఫిల్ టవర్ కి అరుదైన ఘనత దక్కింది. ఇప్పటి వరకు ఈ ఫిల్ టవర్ ని 300మిలియన్ల మంది అంటే 30కోట్ల మది వీక్షించారు. 1989లో తొలిసారిగా దీనిని ప్రజా సందర్శన కోసం ప్రారంభించగా.. అప్పటి నుంచి దీనిని వీక్షించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలను తరలివస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు 30కోట్ల మంది ఈఫిల్ టవర్ ని చూడటానికి వచ్చారని.. ఈ ఫిల్ టవర్ అధికారి ఫేస్ బుక్ ఖాతాలో వెల్లడించారు.
ఈ సందర్భంగా ప్రత్యేకంగా లైట్‌షో, జాజ్‌బార్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. టవర్ మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన డీజే కార్యక్రమంలో పాల్గొనే మొదటి 1500 మంది పర్యాటకులకు ప్రవేశ రుసుము రద్దు చేశారు. కానీ వారు 328 మెట్లు ఎక్కి అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన కట్టడాల్లో ఒకటైన ఈఫిల్ టవర్‌ను గతేడాది 5.8 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక లైట్‌షో శనివారం సాయంత్రం 7:30 నుంచి అర్ధరాత్రి వరకు సాగింది.