మామని పోలీస్ స్టేషన్ కి ఈడ్చిన కోడలు

First Published Oct 1, 2017, 12:27 PM IST
Highlights
  • ఓ కోడలు.. మామగారిని పోలీస్ స్టేషన్ కి ఈడ్చింది.
  • అంతేకాదు.. ఇంట్లో టాయిలెట్ కట్టించాలని ఆయన చేత బలవంతంగా బాండ్ పేపర్ల మీద సంతకం కూడా చేయించింది.

ఓ కోడలు.. మామగారిని పోలీస్ స్టేషన్ కి ఈడ్చింది. అంతేకాదు.. ఇంట్లో టాయిలెట్ కట్టించాలని ఆయన చేత బలవంతంగా బాండ్ పేపర్ల మీద సంతకం కూడా చేయించింది. ఈ సంఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. బిహార్ లోని ముజఫర్ పూర్ జిల్లా ప్రాంతానికి చెందిన మహిళ కొద్ది రోజుల క్రితం వివాహమైంది. ఆమె భర్త.. తమిళనాడులో పనిచేస్తుంటాడు. పని అయిపోయిన తర్వాత తన స్వగ్రామమైన ముజఫర్ జిల్లాకి వస్తుంటాడు. వారి ఇంట్లో టాయ్ లెట్ సదుపాయం లేదు. దీంతో సదరు మహిళ... ఇంట్లో టాయ్ లెట్ కట్టించమని.. మామగారిని, బావ( భర్త అన్న)లను తరచూ కోరేది. వారు ఆమె వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకనేవారు కాదు.

వారి ప్రవర్తను విసుగు చెందిన సదరు మహిళ గత నెల 25వ తేదీన దగ్గరలోని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు.. మహిళ మామగారిని, బావగారిని స్టేషన్ కి పిలిపించారు. వారిద్దరికీ.. టాయ్ లెట్ ఆవశ్యతకను వివరించారు. దీంతో వారిద్దరూ ఇంట్లో మరుగుదొడ్డి కట్టించేందుకు అంగీకారం తెలుపుతూ బాండ్ పేపర్ల మీద సంతకాలు చేశారు.

వారంలోపల మరుగుదొడ్డి నిర్మించాలని లేదంటే.. చర్యలు తీసుకోవాల్సి వస్తుందని మహిళా పోలీసు ఇంఛార్జ్ జ్యోతి వారిని హెచ్చరించారు. అయితే.. వారంలోపల టాయ్ లెట్ నిర్మించలేమని.. డబ్బులు సర్దు బాటు చేసుకునేందుకు మరికొంత సమయం ఇవ్వాల్సిందిగా వారు పోలీసులను కోరారు. అందుకు పోలీసులు అంగీకరించారు.  అనంతరం బాధిత మహిళ.. తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. మరుగుదొడ్డి మహిళల ఆత్మగౌరవమని.. ప్రతి ఒక్కరూ తప్పక నిర్మించుకోవాలని పోలీసు ఇంఛార్జ్ జ్యోతి చెప్పారు.

click me!