కెసిఆర్ అనంతపురం పర్యటన విశేషం ఏమిటో తెలుసా...

First Published Oct 1, 2017, 11:41 AM IST
Highlights

అక్టోబర్ 1, 1953న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం (వెంకటాపురం గ్రామం) వచ్చారు. ఆంధ్రప్రదేశ్ మాతా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత- పరిటాల రవి కుమారుడు శ్రీరామ్ పెళ్లికి ఆయన హాజరయ్యారు. పెళ్లికి హాజరుకావడం పెద్ద విశేషం కాదు. అయితే, ఆయన ఆంధ్రలో కాలుమోపింది అక్టోబర్ 1 వ తేదీన. ఈ తేదీ వల్ల ఆయన పర్యటనకు ప్రాముఖ్యం వచ్చింది.  ఈ ఇది ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు జాతి, తెలుగుసంస్కృతి, తెలుగుచరిత్ర వేరంటూ తమిళులపెత్తనానికి వ్యతిరేకంగా ఉద్యమించి తెలుగు భాషా మాట్లాడే వారికి ఒక రాష్ట్రం తెచ్చుకున్నారు.  అదే ఆంధ్ర రాష్ట్రం. అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు.  అది  1953 అక్టోబర్ 1 కర్నూలు రాజధానిగా ఏర్పడింది. నాటి ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి, తెలంగాణా రాష్ట్ర ఉద్యమానికి చాలా పోలికలున్నాయి. అందువల్ల యాదృచ్ఛికమే అయినా, కెసిఆర్ పర్యటన  అక్టోబర్ 1 జరగడంతో   చాలా ప్రాముఖ్యం వచ్చింది. తెలంగాణ ఏర్పడ్డాక మిగిలిన ఆంధ్ర ప్రదేశ్, నిజానికి ఆంధ్ర రాష్ట్రమే. తెలుగువాళ్ల రాష్ట్రాలు ఏర్పడేందుకు బాట వేసిన తేదీ అక్టోబర్ 1. అయితే, ఈ తేదీని మర్చిపోయారు. తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన తేదీని జ్ఞాపకం చేసుకోవడం కూడా మర్చిపోయారు. కెసిఆర్ పర్యటన దానిని గుర్తు చేసింది.

 

click me!