
జూలై 1, 2017 దగ్గర పడుతూ ఉంది.
ఆ రోజు నుంచి భార్యా బిడ్దలతోకలిసో, ప్రెండ్స్ తోనో సరదాగా హుషారుగా, ఏదైనా జిగేల్ మనే రెస్టరాంట్ కు వెళ్లారో...
బాదుడే... బాదుడు.
ఎందుకంటే, ఆ రోజు నుంచి ఇండియాలో జిఎస్ టి (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ) అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించిన బిల్లు మార్చి 29న లోక్ సభ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.
ఇప్పటిదాకా హోటల్ మహాశయులు చాలా టాక్స్ ని మన మీద వేయకుండా, బిల్లు భారం పడకుండా చేస్తూవచ్చారు.
ఇపుడు రెస్టరాంట్లు ఏటా నాలుగు శాతం మాండేటరీ కాంపోజిషన్ టాక్స్ (సిఒటి) ప్రభుత్వానికి చెల్లిస్తూ వస్తున్నారు.ఇది వినియోగదారులమీద పడేది కాదు.
జిఎస్ టి అమలులోకి వచ్చాక, రు.50 లక్షలటర్నోవర్ ఉన్న హోటళ్ళలో వినియోగ దారుల మీద 17 శాతం టాక్స్ పడుతుంది. ఇందులో 5 శాతం మాండేటరీ కాంపోజిషన్ టాక్స్, 12 శాతం జిఎస్ టి ఉంటాయి. ఇదంతా హోటెలియర్స్ మన మీదకు తోసేయనున్నారు.దీనితో బిల్లు భారమవుతుంది. రు. 50లక్షల టర్నోవర్ ఉన్న హోటల్స్ అన్నీ 18 శాతం టిస్ టి శ్లాబ్ లో పడతాయి. జిఎస్ టిలో మూడు శ్లాబులుంటాయి. అవి అయిదు శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం. ఒక మాదిరి హోటళ్లన్నీ కూడా 18 శాతం లో పడిపోతాయి.