
ఆంధ్ర ప్రదేశ్ అవినీతి నిరోధఖ శాఖ అధికారులకు నూరుకోట్ల బరువైన అవినీతి తిమింగలం దొరికింది. ఆంధ్రప్రదేశ్ రోడ్డు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ గంగధదర్ ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం దాడులు జరిపి అక్కడిఆస్తులు నగదు చూసి విస్తుపోయారు. ఈ వార్త రాస్తున్నప్పటికి ఈ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. దాడుల్లో భారీగా నగదు, నగలు ఆస్తుల పత్రాలు దొరుకుతున్నాయి.
చీఫ్ ఇంజనీర్ ఎం గంగాధర్‌తో పాటు రోడ్డు కాంట్రాక్టర్ నాగభూషణంపై చాలా ఆరోపణలు అందడంతో ఏసీబీ రంగ ప్రవేశం చేసింది. వీరిద్దరి ఇళ్లతో పాటు బంధువుల స్నేహితుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరిపారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలలో వీరికి ఇళ్లున్నట్టున్నాయి. విశాఖ, నెల్లూరు, కడప, గుంటూరు, చిత్తూరు, విజయవాడ, హైదరాబాద్‌ల్లో సుమారు 20 చోట్ల సోదాలు ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి.
ఒక్క హైదరాబాద్ నగరంలోనే 11 చోట్ల ఏసీబీ సోదాలు జరిగాయి. సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. గంగాధరం కు కూకట్‌పల్లి రాంకీ టవర్స్‌లో రూ. 8 కోట్ల విల్లా, అక్కడి వివేకానందనగర్‌లోనే ఒక మాంచి ఇల్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
కూకట్‌పల్లి ఇంట్లో రూ. 40 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటి వరకు వివిధ చోట్ల జరిపిన సోదాల్లో 50 లక్షల విలువైన బంగారం, 5 బ్యాంకు లాకర్లను అధికారులు గుర్తించారు. డాక్యుమెంట్ల ప్రకారం 8 కోట్ల ఆస్తులున్నట్టు కనుక్కున్నా వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. 100 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీఅధికారులు చెబుతున్నారు. విజయవాడలోని కాంట్రాక్టర్ నగభూషణ ఇంట్లో కూడా రూ. 40 లక్షలు సీజ్ చేశారని తెలిసింది.